2025లో వీరిని కోటీశ్వరులను చెయ్యకుండా వదిలిపెట్టనన్న రాహువు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశులవారి జాతకాలను మారుస్తూ జీవితాలని నిర్దేశిస్తాయి. రాహు గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో ఒక ముఖ్యమైన స్థానం ఉంది. రాహు గ్రహాన్ని నీడ గ్రహం గాను, చెడు చేసే గ్రహం గానూ చెప్తారు కానీ రాహువు ఎవరి జాతకంలోనైనా ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు, మంచి స్థానంలో ఉన్నప్పుడు తప్పకుండా మంచి కూడా చేస్తాడు.
రాహు సంచారం
రాహువు ఎప్పుడూ తిరోగమనములో సంచారం చేస్తాడు. ప్రస్తుతం రాహువు బృహస్పతి పాలించే మీన రాశిలో ఉన్నాడు . రాహువు 2025 మే 18 వ తేదీన కుంభరాశి లోకి ప్రవేశించబోతున్నాడు. కుంభరాశిలోకి రాహువు సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు కలుగుతాయి. వారికి అన్ని విధాలుగా శుభ ఫలితాలు వస్తాయి. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారికి రాహువు కుంభ రాశిలోకి ప్రవేశించడం కలిసొస్తుంది. ఈ సమయంలో మేష రాశి వారి కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. మేష రాశి జాతకులు అసంపూర్ణంగా ఉన్న పనులను ఈ సమయంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వర్తక వ్యాపారాలలో ఇబ్బందులు ఉన్నవారి సమస్యలు పరిష్కారమై వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.
కన్యారాశి
రాహువు కుంభరాశిలో సంచరించడం కన్యా రాశి వారికి మేలు చేస్తుంది. 2025 సంవత్సరంలో చాలా అద్భుతమైన ప్రయోజనాలను కన్యారాశి జాతకులు పొందబోతున్నారు. వీరి జీవితంలో ఎలాంటి సమస్యలనైనా ఈ ఈ సమయంలో పరిష్కరిస్తారు. ఉద్యోగాలు చేసే వారికి కూడా ప్రత్యేకమైన ఆఫర్స్ లభిస్తాయి. ఈ సమయం విద్యార్థులకు కూడా బాగా కలిసొస్తుంది.
ధనస్సు రాశి
2025 సంవత్సరంలో ధనుస్సు రాశి వారి కోరికలను రాహువు నెరవేర్చనున్నాడు. కుంభరాశిలో రాహువు సంచరించడం వల్ల వీరికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. మీరు చేసే పనుల్లో విజయాలను సాధిస్తారు. ఇది ధనుస్సు రాశి వారికి శుభ సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications