చెడు చేసే రాహువు ఏప్రిల్ 15వరకు మూడు నెలలు ఈ రాశులకు మంచి చేస్తాడు!
వేద జ్యోతిషశాస్త్రంలో నవగ్రహాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ ఉంటాయి ఇక నవగ్రహాలలో నీడ గ్రహం గాను చెడు చేసే గ్రహం గానూ చెప్పుకునే రాహువు ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్నాడు కుంభ రాశిలో రాహువు ఏప్రిల్ 15వ తేదీ వరకు ఉంటాడు.
రాహువు సంచారం
ఈ మూడు నెలల కాలంలో రాహువు యవ్వన స్థితిలో ఉంటాడు. ఈ సమయంలో రాహువు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తున్నాడు. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. రాహువు కారణంగా ఏప్రిల్ 15వ తేదీ వరకు అదృష్టాన్ని పొందే ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

మిధున రాశి
మిధున రాశి వారికి రాహువు అదృష్టాన్ని ఇస్తున్నాడు. మిధున రాశిలో రాహువు జాతకంలో 9వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల ఈ సమయంలో మిధున రాశి వారు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ సామర్ధ్యాలు, నిర్ణయం తీసుకునే శక్తి పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ వివాదాలు తగ్గుతాయి. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయి.
కన్యారాశి
కన్యా రాశి వారి సంచార జాతకంలో రాహువు 6వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల అది శత్రువులపైన మీరు పైచేయి సాధించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. జీవితంలోని సమస్యలు తగ్గుముఖం పడతాయి. సవాళ్లు పరిష్కరించబడతాయి. రాబోయే మూడునెలలు కన్యా రాశి వారికి రాహు సంచారం జీవితంలో గణనీయమైన మార్పులను తెస్తుంది. విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్న వారికి వీసా లభిస్తుంది. దీర్ఘకాలికంగా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. పాత అప్పులను తిరిగి చెల్లిస్తారు.
కుంభరాశి
లగ్న గృహంలో రాహువు సంచారం కుంభరాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. కుంభ రాశి వారికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం బలపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. శారీరక, మానసిక బలం చేకూరుతుంది. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. విద్య, పోటీ పరీక్షలు, వినూత్న రంగాలలో విజయం వరిస్తుంది. ఈ వ్యాపారాలు చేసే వారికి, కొత్త ప్రాజెక్ట్ లు చూసేవారికి పురోగమనం కనిపిస్తుంది. రాహువు ప్రభావం వ్యక్తులను భావోద్వేగ అనుబంధాల నుండి విముక్తులను చేస్తుంది.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.
-
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
మఖా నక్షత్రంలోకి కేతువు సంచారం.. మకరరాశితో సహా ఆ రాశులవారికి పండుగే! -
ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా? -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం సంపద కోసం ఇంట్లో పెంచాల్సిన 5 మొక్కలు ఇవే! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications