శని నక్షత్రంలో రాహువు.. 4 రాశులవారికి కుబేర కటాక్షం
వేద జ్యోతిష్య శాస్త్రంలో రాహు కేతు గ్రహాలను నీడ గ్రహాలుగా చెబుతారు. స్థానికుల అదృష్టాన్ని మార్చగల నీడ గ్రహంగా గుర్తింపు ఉన్న రాహువు నెమ్మదిగా కదిలే గ్రహం. ఇది ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారడానికి 18 నెలల సమయం పడుతుంది. ఇది మొత్తం 12 రాశులలో ప్రయాణం చేయడానికి చాలా సంవత్సరాల సమయం పడుతుంది.
శని నక్షత్రంలో రాహువు సంచారం
రాహువు సంచారం కారణంగా అనేక రాశుల వారి జీవితాలలో సానుకూల ప్రతికూల ఫలితాలు ఉంటాయి. 2024 జులై 8వ తేదీన రాహువు ఉత్తరాభాద్ర నక్షత్రమైన శని నక్షత్రం లోనికి ప్రవేశిస్తాడు. శని నక్షత్రంలో రాహువు సంచారం ముఖ్యంగా నాలుగు రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ రాశులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహువు సంచారం చాలా ఫలవంతంగా ఉంటుంది. కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులపై లాభాలను పొందుతారు. ఉద్యోగాలు చేసేవారు ఉన్నతోద్యోగుల నుంచి ప్రశంసలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు సంపాదించడానికి ఇది సరైన సమయం. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక తీరుతుంది. పెండింగ్లో ఉన్న అన్ని పనులు పూర్తవుతాయి.
తులారాశి
శని నక్షత్రంలో రాహువు సంచారం కారణంగా తులా రాశి వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు మంచి ఆదాయాన్ని పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వివిధ వనరుల నుండి డబ్బు సంపాదించడానికి నూతన అవకాశాలు కనిపిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అన్నింటిలోనూ విజయాన్ని సాధిస్తారు. కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించుకొని ముందుకు సాగుతారు.
మకర రాశి
శని నక్షత్రంలో రామ సంచారం కారణంగా మకర రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది మకర రాశి జాతకులు ఈ సమయాలో ఆస్తి కొనుగోలు లేదా ఏదైనా వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. లాభాలు అర్థించడానికి పెట్టుబడులు పెట్టేందుకు మకర రాశి వారికి ఇది సరైన సమయం ఈ రాశి జాతకులకు ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి.
కుంభరాశి
ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహు సంచారం కారణంగా కుంభ రాశి వారికి అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుంది. కెరీర్లో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. ఈ సమయంలో డబ్బు సంపాదించడానికి ఆదా చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కుంభ రాశి వారి ప్రేమ జీవితం చాలా సంతృప్తిగా ఉంటుంది. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications