నవంబర్ లో ఈ రాశులవారిని కుబేరులను చేస్తున్న రాహువు!!
వేద జ్యోతిష శాస్త్రంలో రాహువుకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. రాహువును చెడు చేసే గ్రహంగాను, నీడ గ్రహంగానూ భావిస్తారు. క్రూర గ్రహంగా భావించే రాహువు వివిధ రాశులలో ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. రాహువు నీచ స్థితిలో ఉంటే వారు భరించలేని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. రాహువు ఎప్పుడు తిరోగమనం లోనే సంచారం చేస్తాడు.
శతభిష నక్షత్రంలోకి రాహువు
18 నెలలకు ఒకసారి రాహువు తన రాశిని మారుస్తూ ఉంటాడు. ప్రస్తుతం నవంబర్లో రాహువు పూర్వాభాద్ర నక్షత్రం నుండి నిష్క్రమించి శతభిషా నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు. రాహువు తన సొంత నక్షత్రమైన శతభిష నక్షత్రంలో సంచరించడం ఒక ముఖ్యమైన సంఘటనగా చెప్పబడుతుంది .రాహువు శతభిషా నక్షత్ర సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

మిధున రాశి
శతభిషా నక్షత్రంలోకి రాహువు సంచారం చేయడం మిధున రాశి జాతకులకు కలిసి వస్తుంది. వీరి జీవితంలోని వివిధ కోణాల నుండి పురోగతిని పొందుతారు. ఉద్యోగం చేసే చోట ప్రమోషన్లు వస్తాయి. కృషికి తగిన ఫలితం ఉంటుంది. వ్యాపారాలలో గొప్ప పురోగతి కనిపిస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఈ సంపద స్థాయి పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. తండ్రితో సంబంధం బలపడుతుంది. పూర్వీకుల ఆస్తి వారసత్వంగా పొందే అవకాశం ఉంది.
కర్కాటక రాశి
శతభిష నక్షత్రంలో రాహువు సంచారం కర్కాటక రాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు వివిధ రంగాలలో అపారమైన ప్రయోజనాలను పొందుతారు. వీరికి ప్రజాధరణ పెరుగుతుంది. వీరి వ్యక్తిత్వం ప్రతి ఒక్కరితో ఆకర్షించబడుతుంది. కెరీర్లో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈ సమయంలో చేసే ప్రయాణాలు కూడా విజయాలను ఇస్తాయి.
కుంభరాశి
శతభిష నక్షత్రంలో రాహువు సంచారం కుంభరాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ సమయంలో కుంభరాశి జాతకులు జీవితంలో పెద్ద మార్పును చూస్తారు. ఆర్థికంగా ఈ సమయం చాలా ఫలవంతంగా ఉంటుంది. కొత్త వనరుల నుండి డబ్బులు పొందుతారు. ఆర్థిక సమస్యలు పరిష్కారమై సంతోషంగా ఉంటారు. వ్యవహారాలలో అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం అయ్యే అవకాశం ఉంది. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. పనిచేసే చోట మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications