నవంబర్ 23నుండి వీరి పంట పండుతుంది!

నవగ్రహాలలో నీడ గ్రహాలుగా, చెడు చేసే గ్రహాలుగా రాహు, కేతువులకు పేరుంది. అటువంటి రాహు,కేతువులు నవంబర్ మాసంలో నక్షత్ర సంచారం చేయబోతున్నారు. నవంబర్ 23వ తేదీన రాహువు పూర్వాభాద్ర నక్షత్రాన్ని వదిలిపెట్టి శతభిష నక్షత్రం లోకి ప్రవేశం చేయనున్నాడు. కేతువు పూర్వ ఫాల్గుణి నక్షత్రంలో మూడవ దశ దాటి రెండవ దశకు చేరుకుంటాడు.

రాహు, కేతువుల సంచారం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహుకేతువుల ఈ సంచారం కొన్ని రాశుల వారికి శుభాలను చేకూరుస్తుంది. సహజంగా రాహుకేతువులు చెడు చేసే గ్రహాలు అయినప్పటికీ, అవి ఉచ్ఛ స్థానంలో సంచరించే సమయంలో కొన్ని రాశుల వారికి మేలు చేస్తాయి. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

rahu ketu nakshatra transit on november 23rd gives luck to these zodiac signs

తులారాశి
రాహు కేతువుల నక్షత్ర సంచారం తులారాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయం తులారాశి వారి ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. సానుకూల మార్పులు వస్తాయి. పదోన్నతులు, జీతాలపెంపు కొనసాగుతుంది. వ్యాపారం చేసే వారికి కలిసి వస్తుంది. నూతన భాగస్వామ్య వ్యాపారాలు చేయాలనుకునే వారికి కూడా ఇది మంచి సమయం. తులారాశి వారికి చిన్న సంపాదన కూడా పెద్ద లాభాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో పర్యటనలు కూడా శుభప్రదంగా ఉంటాయి.

ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి రాహు కేతువుల నక్షత్ర మార్పు కలిసి వస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు ఆర్థికంగా బలపడతారు. కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఎప్పటినుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో పెద్ద అవకాశాలు వస్తాయి. టెక్నాలజీ, ఎడ్యుకేషన్, క్రియేటివ్, విదేశీ వ్యాపారం తో సంబంధం ఉన్నవారు ప్రయోజనాలను పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. జీవిత భాగస్వామితో సమయం గడుపుతారు.

మకర రాశి
రాహు, కేతువుల నక్షత్ర మార్పు మకర రాశి జాతకులకు సానుకూల ప్రయోజనాలను ఇస్తుంది. ఈ సమయంలో మకర రాశి జాతకులు దీర్ఘకాలంలో ఎదురుచూస్తున్న అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. కెరీర్ ఊపందుకుంటుంది. మీరు చేసే పనికి గుర్తింపు లభిస్తుంది. మీ పని ప్రశంసించబడుతుంది. సీనియర్ అధికారులు మీపైన విశ్వాసాన్ని పెంచుకుంటారు పదోన్నతి లభిస్తుంది. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు మంచి అవకాశాలను పొందుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+