Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2025 మే వరకు వీరికి సంపదలవర్షం కురిపించే రాహు కేతువులు!!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఇక గ్రహాలలో నీడ గ్రహాలుగా చెప్పే రాహు కేతువులు అశుభాలకు సంకేతంగా చాలామంది భావిస్తారు. అయితే అటువంటి అశుభాలని ఇచ్చే రాహుకేతువులు కూడా శుభదృష్టితో ఉన్నప్పుడు సానుకూల ఫలితాలను ఇస్తారు.

రాహువు ప్రస్తుతం మీనరాశిలో, కేతువు కన్యారాశిలో
రాహు కేతువుల గమనం చాలా నిదానంగా ఉంటుంది. ఈ రెండు ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రయాణం చేసేందుకు 18 నెలల సమయం పడుతుంది. 2023 అక్టోబర్ 30వ తేదీన రాహు కేతువుల సంచారం జరిగింది. 2023 అక్టోబర్ 30 నుండి 2025 మే 18 వ తేదీ వరకు రాహువు మీనరాశిలోనూ, కేతువు కన్య రాశిలోనూ ఉంటాయి.

Rahu Ketu will give wealth to these zodiac signs for nine months till May 2025

రాహు కేతువుల కారణంగా అదృష్ట రాశులు
అంతుచిక్కని గ్రహాలైనటువంటి రాహు కేతువులు ఎప్పుడూ తిరోగమన స్థితిలోనే సంచరిస్తూ ఉంటాయి. ఈ గ్రహాలు శుభస్థితిలో ఉంటే ఆ రాశుల వారికి శుభ ఫలితాలు వస్తాయి. వచ్చే తొమ్మిది నెలల వరకు రాహు కేతువులు రాశిని మారే అవకాశం లేదు. 2025 వరకు రాహు కేతువుల శుభస్థితి కారణంగా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తున్నాయి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేష రాశి
రాహు కేతువుల సంచారం కారణంగా మేష రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది .మేష రాశి వారి జీవితంలో కొత్త కొత్త మార్పులు వస్తాయి. మేష రాశి వారికి సానుకూల ఫలితాలు ఈ సమయంలో కలుగుతాయి. ఆర్థికంగానూ లాభదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఇది మేష రాశి వారికి నిజంగా శుభ సమయం.

ధనస్సు రాశి
రాహు కేతువుల శుభసంచారం కారణంగా ధనుస్సు రాశి వారికి ప్రయోజనాలు చేకూరుతాయి. ఆర్థికంగా ధనుస్సు రాశి వారు బలోపేతమవుతారు. వీరి కష్టాలన్నీ తొలగిపోతాయి. జీవిత భాగస్వామి నుంచి పరిపూర్ణమైన మద్దతు లభిస్తుంది. ఉద్యోగ రీత్య చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారస్తులకు డబ్బుకు సంబంధించిన శుభవార్తలు అందుతాయి.

సింహరాశి
రాహు కేతువుల సంచారం కారణంగా సింహ రాశి వారికి మంచి ఫలితాలు వస్తే సింహ రాశి వారు ఈ సమయంలో ఆర్థికంగా లాభపడతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పిల్లలనుంచి శుభవార్తలు వింటారు. కెరీర్ లోను మంచి అవకాశాలు లభిస్తాయి.

వృశ్చిక రాశి
రాహు కేతువుల శుభసంచారం కారణంగా వృశ్చిక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి సంపద వృద్ధి జరుగుతుంది. ఉద్యోగం చేసే చోటా సహఉద్యోగుల మద్దతు లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు లబ్ధి జరుగుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+