కుంభరాశిలోకి రాహువు ఎంట్రీ.. నేటినుండి వీరిల్లు బంగారం అవుతుంది!
నవగ్రహాలలో నీడ గ్రహంగా కీడు గ్రహంగా చెప్పుకు రాహువు తిరోగమనంలో సంచరిస్తూ ఉంటాడు. సహజంగా రాహువును చెడు చేసే గ్రహం అంటారు. కానీ రాహువు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు కొన్ని రాశుల వారికి శుభాలు కూడా చేకూరుస్తాయి. ప్రస్తుతం నేడు రాహువు శని రాసిన కుంభరాశిలో సంచారం చేయబోతున్నాడు.
శని రాశిలో రాహువు సంచారం
ఈరోజు సాయంత్రం 5 గంటలకు రాహువు శని రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తూ వివిధ రాశుల వారికి శుభ ఫలితాలను చేకూరుస్తాయి. రాహువు సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి నేటి నుండి అదృష్టం కలిసి రాబోతుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి
కుంభరాశిలో రాహువు సంచారం మేషరాశి జాతకులకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మేష రాశి వారి ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుతాయి. మేషరాశి వారి ఆదాయం పెరుగుతుంది. వీరికి మంచి రోజులు వస్తున్నాయి.
మిధున రాశి
రాహువు సంచారం కారణంగా మిధున రాశి జాతకులు అదృష్ట జాతకులు గా మారుతున్నారు. ఈ సమయంలో మిధున రాశి వారు నూతన వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలు చేసే వారిని అన్ని విధాల శుభాలు చేకూరుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఎప్పటినుంచో పూర్తికాని పనులు పూర్తవుతాయి. మిధున రాశి వారికి ఇది అదృష్ట సమయం.
కర్కాటక రాశి
రాహువు సంచారం కారణంగా కర్కాటక రాశి జాతకులకు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వీరికి కష్టానికి తగిన ఫలితం వస్తుంది. ఉద్యోగం చేసే వారికి పురోగతి కనిపిస్తుంది. ఆఫీసులో సహోద్యోగులు సహకారాన్ని అందిస్తారు. కొత్త పనులు మొదలుపెట్టి సక్సెస్ కావడానికి ఇది మంచి సమయం. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు రాహువు సంచారం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి. రాహువు రాశి మార్పు ధనుస్సు రాశి వారికి మంచి లాభాలను చేకూరుస్తుంది . ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తొలగిపోయి అంతా సంతోషంగా ఉంటారు. ధనుస్సు రాశి వారికి ఇది శుభ సమయం.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications