ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి రాహువు సంచారం.. ఈ ఏడాదంతా వీళ్ళకు రాజభోగం
వేద జ్యోతిష్య శాస్త్రంలో నీడ గ్రహంగా చెప్పబడే రాహువు ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్నాడు. గత సంవత్సరం మీనరాశిలో ప్రవేశించిన రాహువు 2025 లో మళ్లీ రాశి మారుతాడు. అయితే త్వరలో రాహువు నక్షత్రాన్ని కూడా మార్చుకోబోతున్నాడు. ప్రస్తుతం రేవతి నక్షత్రంలో సంచరిస్తున్న రాహువు జులై 8వ తేదీన ఉత్తరాభాద్ర నక్షత్రంలోనికి రవాణా అవుతాడు. ఈ సంవత్సరం చివరి వరకు రాహువు ఇదే నక్షత్రంలో తిరోగమన దిశలో సంచరిస్తూ ప్రయాణం చేస్తాడు.
రాజభోగాలను ఇచ్చే రాహువు
ఇక ఈ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు కావడంతో, శనికి రాహువు కి మధ్య సఖ్యత ఉన్న నేపథ్యంలో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారి పైన రాహువు యొక్క కటాక్షం ఉంటుంది. ఈ సమయంలో వారు రాజభోగాలను అనుభవించే అవకాశం ఉంటుంది. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహువు సానుకూల ఫలితాలను ఇచ్చే రాశులను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభ రాశి
ఉత్తరభాద్ర నక్షత్రం లోకి రాహువు నక్షత్ర మార్పు వల్ల వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా లాభదాయకంగా ఉంటుంది. ఈ ఏడాది చివరి వరకు వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొద్దిగా ఖర్చులు పెరిగినప్పటికీ వృషభరాశి వారు ఆర్థికంగా బలోపేతంగా ఉంటారు. ఈ సమయంలో కొత్త పనులను ప్రారంభిస్తే కూడా శుభం జరుగుతుంది. వృషభరాశి జాతకులకు ఈ సమయంలో వైవాహిక జీవితం కూడా సంతోషదాయకంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
రాహువు నక్షత్ర మార్పు వల్ల వృశ్చిక రాశి వారికి కలిసొస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి రాహువు మార్పు వల్ల గతంలో ఆగిపోయిన పనులను ఇప్పుడు వృశ్చిక రాశి వారు పూర్తి చేయగలుగుతారు. కెరీర్లో ప్రమోషన్లు పొందడానికి చాలా ముఖ్యమైన పనులను చేయవలసి ఉంటుంది. కొన్ని శుభవార్తలను కూడా వింటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది . ఈ సమయంలో మీరు బాగా పని చేయాల్సి ఉంటుంది.
తులారాశి
తులారాశి వారికి రాహువు నక్షత్ర మార్పు ఈ సంవత్సరం చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. దాంపత్య జీవితం చాలా ఆనందంగా సాగుతుంది. వ్యాపారంగంలో ఉన్నవారు మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఈ సమయంలో సుఖంగా రాజభోగాలతో తులతూవుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications