ఆగస్ట్ లో వీరికి డబ్బుల మూటలను మోసుకొస్తున్న రాహువు!!

వేద జ్యోతిష్య శాస్త్రంలో నీడ గ్రహంగా చెప్పబడే రాహువు ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్నాడు. గత సంవత్సరం మీనరాశిలో ప్రవేశించిన రాహువు 2025 మే 18న మళ్లీ రాశి మారుతాడు. రేవతి నక్షత్రం నుండి రాహువు జులై 8వ తేదీన ఉత్తరాభాద్ర నక్షత్రంలోనికి రవాణా అయ్యాడు. ఈ సంవత్సరం చివరి వరకు రాహువు ఇదే నక్షత్రంలో తిరోగమన దిశలో సంచరిస్తూ ప్రయాణం చేస్తాడు.

ఉత్తరాభాద్ర మూడో దశలోనికి రాహువు
అయితే రాహువు ఉత్తరా భాద్ర నక్షత్రంలో రెండు దశలు పూర్తి చేసి మూడో దశలోకి అడుగు పెట్టబోతున్నాడు. ప్రస్తుతం ఆగస్ట్ 16న ఉదయం 9గంటల 36నిముషాలకు రాహువు ఉత్తరాభాద్ర మూడో దశలోనికి ప్రవేశిస్తున్నాడు. ఇక రాహువు డిసెంబర్ 2 వరకు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు. ఇక ఈ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు కావడంతో, శనికి రాహువుకి మధ్య సఖ్యత ఉన్న నేపథ్యంలో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

Rahu transit into Uttarabhadra Nakshatra third phase wealth to these zodiac signs

మిధున రాశి
ఉత్తరభాద్ర నక్షత్రం లోకి రాహువు నక్షత్ర సంచారం వల్ల మిధున రాశి వారికి ఈ సంవత్సరం అంతా లాభదాయకంగా ఉంటుంది. మిధునరాశి వారు ఆర్థికంగా బలోపేతంగా ఉంటారు. ఈ ఏడాది చివరి వరకు మిధున రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈ సమయంలో కొత్త పనులను ప్రారంభిస్తే కూడా శుభం జరుగుతుంది. మిధునరాశి జాతకులకు ఈ సమయంలో వైవాహిక జీవితం కూడా సంతోషదాయకంగా ఉంటుంది.

సింహరాశి
రాహువు నక్షత్ర సంచారం వల్ల సింహరాశి వారికి కలిసొస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం మూడవ దశలో రాహువు సంచారం వల్ల కెరీర్లో ప్రమోషన్లు పొందడానికి అనుకూల సమయం. కొన్ని శుభవార్తలను కూడా వింటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది . ఈ సమయంలో మీరు బాగా పని చేయాల్సి ఉంటుంది. గతంలో ఆగిపోయిన పనులను ఇప్పుడు సింహరాశి వారు పూర్తి చేయగలుగుతారు.

తులారాశి
తులారాశి వారికి రాహువు నక్షత్ర సంచారం ఈ సంవత్సరం చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో సుఖంగా రాజభోగాలతో తులతూగుతారు. దాంపత్య జీవితం చాలా ఆనందంగా సాగుతుంది. వ్యాపారంగంలో ఉన్నవారు లాభాలను చూస్తారు . ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+