వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రక్షాబంధన్: రాఖీలో ఆ మూడు పోగులు, ముడులకు సంకేతం ఇదే!

By Srinivas
|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యాన్ని (యజ్ఞోపవీతం) ధరించాలి.

Raksha Bandhan 2018:

ఈ రోజు
శ్రావణ పౌర్ణమి

అన్నా చెల్లెల్ల అనురాగ బంధాలు

మరింత బలపడే రోజు ఈ రోజు..

అమ్మ ప్రకటించే ప్రేమ, ఆదరణ

నాన్న కనబరిచే బాధ్యతాయుత భద్రత

ప్రతిబించేది ఈ రోజు ప్రతి ఇంట్లో ఆనందాల హరివిల్లు ఈ రోజు

రాఖీ... అంటే.....

రాకా చంద్రుడు
(రాకా =నిండు దనం )
అను మాట నుండి..

నిండు పున్నమి నాడు ధరించే రక్షకు రాఖీ అని పేరు వచ్చింది.

రాఖీ సూత్రం
(మూడు పోగుల దారం)
అసలు పేరు. రక్షిక ..

అలా రక్షణ సంకేతమై వచ్చిందే. ఈ రక్షాబంధనంలో దాగిన.. మూడు ముడులు..
ఆరోగ్యం, ఆయువు, సంపద..
అనేవి ఈ మూడులకు సంకేతం.
వాటి ఆకాంక్షలే ఈ వేడుక.

* ఈ రోజే శ్రీ
హయగ్రీవ స్వామి జయంతి

.

ఈ క్రింది శ్లోకం విద్యార్ధులు చదువుకుని స్వామిని పూజిస్తే మంచి జ్ఞాపకశక్తి వస్తుంది.

జ్ఞానానంద మయం దేవం

నిర్మలం స్ఫటికాకృతిం

ఆధారం సర్వవిద్యానాం

హయగ్రీవముపాస్మహే..!

ఈ రోజు మరో విశేషం కూడ ఉంది.

ఈ శ్రావణ పూర్ణిమ రోజే ఐశ్వర్య కారకుడైన శివుడు
( ఐశ్వర్య కారకో మహేశ్వరః )
మహా లక్ష్మికి ధనాధిపత్యాన్ని అనుగ్రహించిన మహత్తరమైన రోజు.

మరియు
హయగ్రీవుడు శ్రీ సరస్వతి దేవికి విద్యాధిష్ఠాత్రిగా దివ్య శక్తులను అనుగ్రహించినరోజు.

ఈ శ్రావణ పౌర్ణమి ,
జంధ్యాల పౌర్ణమి
(నూతన యజ్ఞోపవీత ధారణ పౌర్ణమి) గా సుప్రసిద్ధి.

ఇంత విశిష్టవంతమైన ఈ పౌర్ణమి సమస్త మానవాళికీ
సర్వ ప్రాణికోటికి సుఖశాంతులను ప్రసాదించగలదని అందరం కోరుకుందాం.

* ఉపాకర్మ ఎందుకు చేస్తారు అంటే

నిత్య కర్మానుష్ఠానము ( త్రికాల సంధ్యా వందనం, అగ్నికార్యం, తర్పణం ) జంధ్యం ధరించిన ప్రతి వారు చేయాలి. కొన్ని అనివార్య కారణాల వలన ఇవి చేయలేకపొయినప్పుడు ఆ సంవత్సరంలో జరిగిన దోషాలకు వాటి ప్రాయశ్చితార్థం తప్పక ఈ ఉపాకర్మ ఆచరించాలి. మరియు ఆ సంవత్సరంలో శుచి,మైల పాటించక వచ్చిన దోషాలను కూడా ఉపాకర్మ ద్వార తొలగించుకోవచ్చును.

* ఇది ఏ వేదం వారు ఎప్పుడు ఆచరిస్తారు అనే సందేహానికి సమాదానం

ఋగ్వేదం - శ్రవణ నక్షత్రం (శ్రావణ మాసం)

* యజుర్వేదం - శ్రవణ పౌర్ణమి సామవేదం - హస్త నక్షత్రం

* శ్రావణమాసంలో నూతన యజ్ఞోపవితాన్ని ధరించక పోతే నిత్య కర్మానుష్ఠానముకు పనికి రాదు అని శాస్త్రం ,పెద్దలు ఖచ్చితంగా చెప్పారు.

* ఉపాకర్మ ఏ విధంగా చేస్తారో క్లుప్తంగా తెలుసుకుందాం.

ఋషి పూజ, తర్పణం, విరజా హోమం, నూతన యజ్ఞపవీత ధారణం, బ్రహ్మ యజ్ఞం,పంచ గవ్య ప్రాసనతో శరీర శుద్ధి మొదలు ముఖ్యంగా ప్రజాపతి, సోముడు, అగ్ని, విశ్వే దేవతలు,సాగంహితి, యాజ్ఞికి, వారుణి, బ్రహ్మస్వయుంబు మొదలగు 9 మంది ఋషులను దర్భలో ఆవాహనం చేసి పూజ చేస్తారు.
సంకల్పంలో ఆ సంవత్సరంలో కలిగిన దోషాల నివృత్తికై అర్చన,పూజలను చేయిస్తారు.

జంధ్యం ధరించిన ప్రతి వారు తప్పక ఈ రోజు దైవ సన్నిధిలో శాస్త్రోక్తంగా ధరించాలి.

English summary
Raksha Bandhan is an annual rite in South Asia, or among people of South Asian origin, centred around the tying of a thread, talisman, or amulet on the wrist as a form of ritual protection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X