6 గ్రహాల అరుదైన సంయోగంతో ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొడుతున్న రాశులు
జ్యోతిష్యం పరంగా మార్చి నెల చాలా కీలకమైన నెల. ఎందుకంటే ఈ నెలలో మీన రాశిలో ఆరు గ్రహాల సంయోగం ఉంది. ముందుగా ఫిబ్రవరిలో మీనరాశిలోకి బుధుడు, మార్చి 14న సూర్య భగవానుడు, మార్చి 28న చంద్రుడు, మార్చి 29న శనిదేవుడుతోపాటు బృహస్పతి, రాహువు సంచారం చేయనున్నాయి. మొత్తం ఆరు గ్రహాల అరుదైన సంయోగం మీనరాశిలో మార్చిలో జరగబోతోంది. దీనివల్ల కొన్ని రాశిచక్ర గుర్తులకు అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. వారికి ఏవిధంగా ఈ సంయోగంవల్ల కలిసిరానుందనే విషయాన్ని తెలుసుకుందాం.
మకర రాశి
పనిచేస్తున్న ప్రాంతంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వృత్తి జీవితం చాలా బాగుంటుంది. అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ఏదైనా పనిని ప్రారంభించాలంటే ఇప్పుడు మంచి సమయం.

కన్యారాశి
ఉద్యోగస్థులు వారి కార్యాలయాల్లో పై అధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం. జీవితంలో మీరు కోరుకున్న మార్పులన్నీ సానుకూలంగా జరుగుతాయి. మీ పనితీరుతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటారు.
మిథునరాశి
జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపడానికే అధిక ప్రాధాన్యతనిస్తారు. పనుల్లో ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. దీనివల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అది కూడా మీకు సానుకూలంగా మారుతుంది.
వృషభరాశి
ఈ రాశివారి జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకోవడంతోపాటు పనులన్నీ సజావుగా సాగుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలతోపాటు శుభవార్తలను వింటారు. ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎదుటివారితో మంచి సంబంధాలను కలిసిగివుంటారు.












Click it and Unblock the Notifications