అరుదైన షడష్టక్ యోగం: ఈ నాలుగు రాశుల వారు జూన్ ౩౦వరకు జాగ్రత్త!!
గ్రహాల సంచారం మరియు కదలిక మానవుల జీవితాలపై విపరీతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. కొన్ని గ్రహాల కలయిక అనుకూల ఫలితాలను, కొన్ని గ్రహాల కలయిక ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు మరియు శని గ్రహాలను శత్రువులు గా పరిగణిస్తారు. ఈ రెండింటి కలయిక వల్ల షడష్టక్ యోగం ఏర్పడుతుంది. ఈ షడష్టక్ యోగం జూన్ 30వ తేదీ వరకు వివిధ రాశుల పైన ప్రభావాన్ని చూపిస్తుంది.
వాటిలో కర్కాటక రాశి, సింహరాశి, ధనుస్సు రాశి, కుంభ రాశులు ఉన్నాయి. ఈ 4 రాశుల వారు జూన్ 30వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.కర్కాటక రాశి జాతకుల పైన షడష్టక్ యోగం ప్రభావం ఉంటుంది. కర్కాటక రాశి రాశిలో కుజుడు ఉండటం వల్ల కర్కాటక రాశి వారి జీవితాల్లో వివిధ ఒడిదుడుకులు ఎదురౌతాయి.

కర్కాటక రాశి వారు జూన్ 30వ తేదీ వరకు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో ఎక్కడా పెట్టుబడి పెట్టకూడదని సూచిస్తున్నారు. అంతే కాదు కర్కాటక రాశి వారు జూన్ 30వ తేదీ వరకు ఆరోగ్యంపైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది.
సింహ రాశి జాతకులపైన కూడా షడష్టక్ యోగం ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. సింహ రాశి జాతకులు ఈ సమయంలో చాలా చెడు ఫలితాలను అనుభవిస్తారు. సింహ రాశి జాతకులకు ఈ సమయంలో ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా క్షీణిస్తుంది. అంతే కాదు సింహ రాశి జాతకులు వివాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించినప్పటికీ అనేక వివాదాల్లో ఇరుక్కోవలసి వస్తుంది.
కుంభరాశి జాతకులపైన కూడా షడష్టక్ యోగం ప్రభావం ఉంటుంది. కుంభరాశి జాతకులు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాహన ప్రమాదాలు జరిగి గాయాల పాలయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో పనులను పూర్తి శ్రద్ధతో చేయాల్సిన అవసరం ఉంది. కుంభ రాశి జాతకులు ఈ సమయంలో ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. అంతేకాదు కుంభ రాశి జాతకులు ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

ధనుస్సు రాశి జాతకులపైన కూడా షడష్టక్ యోగం ప్రభావం ఉంటుంది. ధనుస్సు రాశి జాతకులు సన్నిహితుల ద్వారా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ధనుస్సు రాశి జాతకులు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ పెట్టుబడులు పెడితే నిపుణుల సలహాలు తీసుకోవటం మంచిది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications