rasi phalalu today: ఈరాశులవారికి నేడు ధనలాభం.. మీరున్నారా!!
మార్చి 13వ తేదీన అంటే నేడు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది? ఏ రాశుల వారు ఈ రోజు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది? వంటి అనేక విషయాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. తులారాశి నుండి మీన రాశి వరకు వివిధ రాశుల వారికి ఈ రోజు ఎలా ఉందంటే..
తులారాశి
తులారాశి వారికి ఈరోజు బాగానే ఉంది. బంధుమిత్రులతో వీరు సంతోషంగా గడుపుతారు. అనుకోని వ్యక్తుల సహాయంతో ఒక పనిని పూర్తి చేస్తారు. అయితే తులారాశి జాతకులు పనులను వాయిదా వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తులా రాశి వారి సమస్యలు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో తగ్గుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి మార్చి 13 బాగుందని చెప్పాలి. వృశ్చిక రాశి జాతకులు ఆయా రంగాలలో పనిచేసే వారు సత్ఫలితాలను సాధిస్తారు. విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఇష్ట దైవారాధన శుభప్రదంగా చెప్పబడింది.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులు నేడు స్థిరమైన ఫలితాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా ధనుస్సు రాశి జాతకులకు ఇది శుభకాలం. అంతేకాదు నేడు భోజన సౌఖ్యం, మనః సౌఖ్యం వీరికి కలుగుతుంది. నేడు మీరు సంతోషంగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది.
మకర రాశి
మకర రాశి జాతకులు ఆశించిన ఫలితాలను రాబట్టడానికి ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. అంతేకాదు ప్రయాణాలలో ముందుచూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సమయపాలన పాటించి జాగ్రత్తగా వ్యవహరించాలి. మంచి ఆహారం తీసుకోవడంతో పాటు విశ్రాంతి కూడా అవసరం. నేటి మకర రాశి జాతకులు మంచి ఫలితాల కోసం శ్రీ రామ నామాన్ని జపించాలి.
కుంభరాశి
కుంభ రాశి జాతకులకు తోటి వారి సహాయ సహకారాలు ఉంటాయి. ధన లాభం కలుగుతుంది. శత్రువులు తగ్గుతారు. ప్రయాణాలు చేస్తే అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థిరమైన చిత్తంతో వ్యవహరిస్తే మంచిది. కుల దైవారాధన చేయడం శుభప్రదంగా చెప్పబడింది.
మీన రాశి
మీనరాశి జాతకులకు తోటివారి సహాయ సహకారాలు ఉంటాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. బంధువులతో సంతోషంగా గడుపుతారు. అయితే అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. దుర్గా అష్టోత్తరం చదవడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications