rasi phalalu today: ఈ రాశులవారు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త!!

నేడు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి. గ్రహాల గమనం కారణంగా రాశులవారి జాతకాలు మారుతూ ఉంటాయన్నది తెలిసిందే. ఎవరికి ఈరోజు అదృష్టం కలిసొస్తుంది? ఎవరు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి? అనే విషయం ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
మేషరాశి జాతకులు బాగా పరపతి ఉన్న వ్యక్తుల నుంచి నేడు ప్రోత్సాహాన్ని పొందుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు డబ్బులను ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. మీ ప్రియమైన వ్యక్తి ఈరోజు మీరు సంతోషంగా ఉండడం కోసం కొన్ని పనులు చేస్తారు. పనిచేసే చోట సహోద్యోగుల నుంచి సహాయం అందుతుంది. పని ఒత్తిడి మానసిక ఆందోళనకు గురిచేస్తుంది. వైవాహిక జీవితానికి సంబంధించి శుభవార్తలు వింటారు.

rasi phalalu today These zodiac signs should be careful about spending money

వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు నేడు మిశ్రమంగా ఉంటుంది. ధ్యానం చేయడం వృషభ రాశి జాతకులకు రిలీఫ్ ఇస్తుంది. బయటకు వెళ్ళినప్పుడు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే నేడు డబ్బులను పోగొట్టుకునే అవకాశం ఉంది. ఈరోజు మీ ప్రేమ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ఈరోజు మీ జీవితం ఒక అందమైన మలుపు తిరుగుతుంది. జీవిత భాగస్వామితో అత్యంత రొమాంటిక్ రోజు గా ఈరోజు మిగిలిపోతుంది.

మిధున రాశి
మిధున రాశి జాతకులకు ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మిధున రాశి జాతకులు నేడు పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడపాలి అనుకున్న వారికి నేడు కాస్త నిరాశ దాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామిని సంతోష పెట్టడానికి ఈరోజు మీరు ప్రయత్నం చేస్తారు. విజయం, శక్తి దండం మీ చేతికి అందినట్టే ఉంటుంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈరోజు అంతా చిరాకులు ఉన్నాయి. ఈరోజు ప్రారంభంలో కొన్ని ఆర్థిక నష్టాలు ఎదురవుతాయి. ఇది ఈరోజు మొత్తాన్ని పాడు చేస్తుంది. ఈరోజు ప్రేమ జీవితంలోని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మీ అవసరాలను తీర్చేందుకు మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తుంది. చివరకు మళ్లీ ఫ్రస్టేషన్ కు గురవుతారు.

సింహరాశి
సింహ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. సరైన విధానంలో డబ్బును ఖర్చు పెట్టడం ఎలాగో మీరు తెలుసుకుంటారు. మీ విచ్చలవిడి డబ్బులు ఖర్చు పెట్టే స్వభావం, మీ జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్ లకు కారణమవుతుంది. మీకు పని పట్ల విధేయత, పనులు జరిగేలా చూసుకోవడంలో సామర్థ్యం గుర్తింపు వచ్చేలా చేస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడపాలనుకునే మీ ఆలోచనను భాగస్వామి తరపు బంధువులు పాడు చేస్తారు.

కన్యారాశి
కన్య రాశి జాతకులకు నేడు పూర్వీకుల నుండి ఆస్తి వచ్చే అవకాశాలను కుటుంబ సభ్యులే అడ్డుకుంటారు. ఈరోజు మత్తు పానీయాలకు దూరంగా ఉండకపోతే విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు నేడు జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితం ఈరోజు అద్భుతంగా ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+