కలలో ఎలుకలు వస్తే ఏం జరుగుతుంది?
చాలామందికి రకరకాల కలలు వస్తున్నాయి. కలలో మనకు కనిపించే వస్తువులు కానీ, జంతువులు కానీ, జరిగే సంఘటనలు గానీ మన భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాలకు సూచనగా చెబుతారు. కలలు మన జీవితంలో జరిగే వాటిని ప్రతిబింబిస్తాయి అని చాలామంది నమ్ముతారు. అయితే కలలో ఎలుకలు కనిపిస్తాయి. కలలో ఎలుకలు కనిపించడం మంచిదా కాదా? ఎలుకలు కనిపిస్తే ఏం జరుగుతుంది? స్వప్న శాస్త్రం దీని గురించి ఏం చెప్పింది? తెలుసుకుందాం.
కలలో ఎలుకలు శుభమా? అశుభమా?
కలలో ఎలుకలు కనిపిస్తే శుభ మరియు అశుభ ఫలితాలు రెండు ఉంటాయని చెబుతారు. అయితే అవి ఏ విధంగా కనిపించాయి అన్న దానిమీద అది ఆధారపడి ఉంటుందని కూడా చెబుతారు. సహజంగా కలలో ఎలుకలు కనిపించడం శుభప్రదమైనది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి, అదృష్టానికి సంబంధించి, కుటుంబ సంతోషానికి సంబంధించి భవిష్యత్తు విషయాలను ఇది సూచిస్తుందని చెబుతారు.

కలలో తెల్ల ఎలుక వస్తే
ఎలుకను గణేశుడికి వాహనంగా చెబుతారు కాబట్టి అటువంటి ఎలుకలు కలలోకి వస్తే శుభప్రదంగా పరిగణిస్తారు. తెల్ల ఎలుక కలలో కనిపిస్తే అది శుభ ప్రదంగా భావించబడుతుంది. ఇది ఆర్ధిక పురోగతిని, శ్రేయస్సును సూచిస్తుంది. రైతులకు కలలో ఎలుకలు వస్తే అది వారికి మంచి పంటను ఇస్తుందని చెప్తున్నారు.
కలలో నల్ల ఎలుక వస్తే
కలలో నల్ల ఎలుక కనిపిస్తే, అది పారిపోవటం కనిపిస్తే ఆర్ధిక ఇబ్బందులు, ఆందోళనలు కలుగుతాయి. సన్నిహితులు ద్రోహం చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. కలలో నల్ల ఎలుక కనిపిస్తే అది ఆందోళనలకు కారణం అవుతుందని, ప్రతికూలతలను చూడాల్సి వస్తుందని అంటారు. మానసిక, శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని చెప్తున్నారు.
కలలో పిల్ల ఎలుక కనిపిస్తే
కలలో పిల్ల ఎలుక కనిపిస్తే కూడా శుభప్రదం అని, దీంతో మీకు పురోగతి కలుగుతుందని అంటారు. కలలో ఎలుక కన్నంలో నుండి మన శరీరం మీదకు పాకటానికి వస్తున్నట్టు అనిపిస్తే ఇది అశుభ సూచకం అని చెప్తారు. ముఖ్యంగా ఎలుక కలలో వస్తే శుభాలే కానీ అవి కనిపించే స్థితిని బట్టి అర్ధాలు మారతాయి.












Click it and Unblock the Notifications