ఇంట్లో వాస్తు దోషాన్ని అద్దంతో తొలగించండి!!
ప్రతి ఒక్కరూ ఇంటిని నిర్మించుకునే సమయంలో కచ్చితంగా వాస్తు శాస్త్రాన్నిఅనుసరించే కడతారు. అయినప్పటికీ కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురైతే వాస్తు దోషం ఉందని నమ్మి మార్పులు చేర్పులు చేయడంలాంటివి చేస్తారు. అయితే ఇంట్లో ఉండే అద్దంతో ఇంట్లో సానుకూల శక్తిని పెంపొందింకోవచ్చు. అద్దం పెట్టుకునే విషయంలో కొన్ని నియమాలుంటాయి. వాటిని జాగ్రత్తగా అనుసరించాలి. అయితే ఇంట్లో ఎటువంటి అద్దాన్ని పెట్టుకొని అన్నీ శుభప్రదంగా జరిగేలా చూసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం.
అద్దం పెట్టే విధానంలో కూడా కొన్ని వాస్తు నియమాలు అనుసరించాలి. ఇలా అనుసరించడంవల్ల ఎటువంటి పొరపాట్లు దొర్లవు. అద్దాన్ని తప్పుడు స్థానంలో ఉంచితే హాని జరిగే అవకాశం ఉందని పండితులు అంటున్నారు. వాస్తుకు సంబంధించిన అనేక రహస్యాలు అద్దంలో దాగివున్నాయంటే ఆశ్చర్యపోతారు. అద్దం సానుకూల శక్తితోపాటు కాంతిని కూడా ప్రసరింపచేస్తుంది. అద్దాలకు సంబంధించిన కాంతి దిశ ఇంటికి ఉత్తర గోడలకు, తూర్పు గోడలకు ఉంటే మంచిది. ఈ దిశలు సానుకూల శక్తికి సంబంధించిన దిశలు.

అద్దంతో దోషాలు ఎలా పోతాయో తెలుసుకుందాం:
తూర్పు వైపు గోడకు అద్దం ఉంచాలి. అనేక శుభ ఫలితాలు కలుగుతాయి.
భోజనాల గదిలో అద్దం పెట్టాలి. దీనివల్ల ఆహారం, సంపద బాగా లభిస్తాయి.
ఇంటి వెనక నేషనల్ హైవే ఉన్నవారు ఇంటి వెనక అష్టభుజి అద్దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి.
బెడ్ రూమ్ లో అద్దాలు పెట్టకూడదు. అసలు నిద్రించే గదిలో అద్దం పెట్టడం సరైన నిర్ణయం అనిపించుకోదు.
వాయువ్య మూల కత్తిరించివుంటే 4 అడుగుల వెడల్పు ఉన్న అద్దాన్ని ఉంచాలి.
వాస్తుపరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నిష్ణాతులైన నిపుణులను కూడా సంప్రదించాలి. వారు చెప్పే విషయాలను కూడా జాగ్రత్తగా పాటించాలి. వీటితోపాటు సద్గురువును వేడుకోండి. అన్ని సమస్యలకు చాలా సులువుగా పరిష్కారం చూపేది ఆయన ఒక్కరే. కాబట్టి లోపాలు సరిచేసుకుంటూనే, మన ప్రయత్నం మనం చేస్తూ గురువు చెప్పిన మాట కూడా వినడంవల్ల ఎటువంటి దోషాలు ఉండవు. కాకపోతే మీకు గురువుపై పూర్తిస్థాయిలో నమ్మకం ఉండాలి.












Click it and Unblock the Notifications