2025లో వీరిని దరిద్ర దేవత వదలదన్న ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి!

2025 సంవత్సరం మరికొద్ది రోజుల్లో రానుంది. 2025 సంవత్సరంలో ఏ రాశుల వారి జాతకం ఏ విధంగా ఉంది అన్నది తెలుసుకోవాలని ఎదురు చూస్తున్న వారు చాలా మందే ఉంటారు. అయితే 2025 లో ఎవరి జాతకం బాగుంది అనేది ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి వెల్లడించారు. 2025 లో ఏ రాశి వారు ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు? అనేది వేణు స్వామి జ్యోతిష్య అంచనాల ప్రకారం ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
2025 సంవత్సరంలో మేషరాశి వారికి ఏలినాటి శని మార్చి 29వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని, దీని కారణంగా వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులలో ఒకరికి ప్రాణగండం ఉంటుందని, ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున మేషరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. ఇక మేషరాశి జాతకులకు ప్రతికూల ఫలితాలు కాకుండా ఆర్థిక విషయాలలో కాస్త అనుకూలతలు ఉన్నాయి.

Renowned astrologer Venu Swamy 2025 prediction these zodiac signs will get poverty

కుంభరాశి
కుంభరాశి వారికి 2025లో శని జన్మ నుంచి ఏలినాటి శని లోకి వస్తున్నాడు. ఏలినాటి శని ప్రారంభం కారణంగా కుంభరాశి వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా తీవ్రమైన ఆరోగ్యం మానసిక సమస్యలు వేధిస్తాయి. ఆర్థిక అనిశ్చితి వల్ల ఇబ్బంది పడతారు. సంతానపరమైన సమస్యలు, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కునే అవకాశం ఉంది .వాహన ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ట్యాక్స్ ల పరంగాను అనేక రకమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

మీన రాశి
2025 సంవత్సరంలో మీనరాశి వారికి ఏలినాటి శని జన్మశనిగా మారబోతుంది. దీని కారణంగా 25సంవత్సరాలు పైబడిన వ్యక్తులకు విపరీతమైన సమస్యలు వస్తాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు వారి ఎడబాటుకు కారణం అవుతాయి. భయానక సంఘటనలు, ఆందోళనలు చోటు చేసుకుంటాయి. ఆదాయం తగ్గిపోతుంది. సమస్యలు పెరుగుతాయి. వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు జరుగుతాయి. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు తీవ్ర సమస్యలు వస్తాయి. వీరికి అత్యంత దరిద్రమైన సంవత్సరం 2025 సంవత్సరం.

ధనుస్సు రాశి
ధనస్సు రాశి జాతకులు 2025 సంవత్సరంలో సమస్యలు ఎదుర్కోబోతున్నారు. వీరికి 2025లో అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది కుటుంబంలో సమస్యలు, పోలీసులు, కోర్టు కేసులు ఇబ్బంది పెడతాయి. సమాజంలో చెడ్డపేరు వస్తుంది. ఇన్కమ్ టాక్స్ రైడ్ ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక 2025 సంవత్సరంలో ధనుస్సు రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలని సూచన. అయితే ఆర్థికంగా ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం బాగానే కలిసి రాబోతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+