బుధుడి తిరోగమన గోచారం.. ఆగస్ట్ 22నుండి వీరు ఆర్ధిక విషయాల్లో జాగ్రత్త!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం కారణంగా అన్ని రాశుల వారు ప్రభావితం అవుతున్నారు. ఆగస్ట్ 22వ తేదీన కర్కాటక రాశిలో బుధుడు తిరోగమనంలో ప్రవేశించబోతున్నాడు. కర్కాటక రాశిలోకి బుధ తిరోగమనం సంచారం కారణంగా అన్ని రాశుల వారి పైన సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయి. అయితే కర్కాటక రాశిలో బుధ సంచారం కారణంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే రాశులు ఏమిటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మేషరాశి
కర్కాటకరాశిలో బుధ తిరోగమన సంచారం కారణంగా మేష రాశి జాతకులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థికంగా మేషరాశి జాతకులు నష్టపోతారు. ఏ పని చేసిన సమర్థవంతంగా దృష్టి పెట్టి చేయలేరు. కుటుంబంలోనూ ఆర్థిక బాధ్యతల కారణంగా ఇబ్బందులు చోటుచేసుకుంటాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు పెద్దగా లాభాలను పొందలేరు. వ్యాపారాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమయం కాస్త కష్టంగా ఉంటుంది. పనిచేసే చోట సరైన గుర్తింపు లభించదు.

మిధున రాశి
బుధ తిరోగమన సంచారం కారణంగా మిధునరాశి జాతకులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో సమస్యలు చోటుచేసుకుంటాయి. కుటుంబ వాతావరణం వివాదాలకు కేంద్రంగా మారుతుంది. పనిచేసే చోట మెరుగైన ప్రదర్శన చూపించలేక పోతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు ఎక్కువ లాభాలను పొందాలంటే విపరీతమైన కష్టపడవలసి వస్తుంది. వ్యాపారస్తులు వ్యాపారం చేసే క్రమంలో సమస్యలను ఎదుర్కొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం అసలు బాగోదు. ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి బుధ తిరోగమన సంచారం కారణంగా ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. మానసిక వ్యాధులు బాధిస్తాయి. ఉద్యోగాలను ఆశిస్తున్న వారు మంచి ఉద్యోగ అవకాశాలను పొందలేరు. విదేశాలకు వెళ్లాలనుకునే వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు కొద్దిపాటి లాభాలను పొందాలంటే కూడా విపరీతమైన కష్టపడవలసి వస్తుంది. తీవ్రమైన పోటీని ఈ సమయంలో ఎదుర్కొంటారు.
సింహరాశి
కర్కాటక రాశిలో బుధ తిరోగమన సంచారం కారణంగా సింహరాశి జాతకులకు అస్సలు మంచిది కాదు. ఆర్ధికంగా ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ సమస్యలు ఏర్పడతాయి. ఈ సమయంలో కెరీర్ అంతగా బాగోదు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు నిరాశ జనకంగా ఉంటాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు ఈ సమయలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ పని చేసినా ఆటంకాలు, పని జాప్యం జరుగుతుంది.
మకర రాశి
బుధ సంచారం కారణంగా మకర రాశి జాతకులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది సరైన సమయం కాదు. ఉద్యోగాలు చేసే వారికి ఆకస్మిక ఉద్యోగ నష్టం లేదా ఉద్యోగ మార్పు సంభవిస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామితోను వ్యాపార భాగస్వాములతోనూ వివాదాలు చోటుచేసుకుంటాయి. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
కుంభరాశి
కుంభరాశి జాతకులకు డబ్బుల విషయంలో ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. కుంభరాశి జాతకులకు ఖర్చులు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఏ పని చేసినా నష్టం వచ్చే అవకాశమే ఎక్కువ ఉంది. ఈ సమయంలో కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అనుకున్న ఫలితాలు రావు కాబట్టి కాస్త సంయమనంతో ఉండాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications