rose plants flowering tips: గులాబీలు బాగా పూలు పూయాలంటే ఇలా చెయ్యండి!!

మొక్కలు ఇంట్లో పెంచుకోవాలి అనుకునేవారు, ఇంట్లో గులాబీ మొక్కలు బాగా పువ్వులు పూయాలని భావించేవారు మొక్కలకు సంబంధించి కొన్ని చిన్న చిన్న చిట్కాలను తెలుసుకుంటే అందమైన గులాబీలను చాలా ఎక్కువగా పూయించవచ్చు. గులాబీ మొక్కలు బాగా పూలు పూయాలంటే వాటికి ఎరువుగా ఏం వేయాలి? సహజ సిద్ధంగా వేటిని వేస్తే గులాబీలు బాగా పూలు పూస్తాయి? గులాబీ మొక్కలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గులాబీ మొక్క చాలా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమయ్యే మొక్క. గులాబీ మొక్కలు పెట్టిన నేలలో పోషకాలు తక్కువగా ఉంటే గులాబీ మొక్కలు ఎక్కువ పువ్వులు పూయవు. గులాబీ మొక్కలు బాగా పూలు పూయాలంటే మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన వాటిని ఎరువుగా ఉపయోగించవచ్చు అవేమిటంటే..

rose plants

అరటిపండు తొక్క ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్లలో నానబెట్టి, బాగా నానిన తర్వాత ఆ నీటిని గులాబీ మొక్క వేర్ల వద్ద పోస్తే మొక్కకు కావలసిన పోషకాలు అంది కొద్ది రోజుల్లోనే పూలు పూయడం ప్రారంభిస్తాయి. గులాబీ మొక్కలకు క్యాల్షియం చాలా అవసరం. గులాబీ మొక్క బాగా పూలు పూయాలంటే కోడిగుడ్డు పెంకులను మిక్సీలో గ్రైండర్ చేసి మెత్తని పొడిగా చేసుకోవాలి.

ఆ పొడిని గులాబీ పాదుకు వేస్తే గులాబీలు బాగా ఎక్కువగా పూలు పూస్తాయి. గులాబీలు బాగా పూలు పూయాలంటే ఉల్లిపాయల పొట్టును కూడా ఉపయోగించవచ్చు. ఉల్లిపాయల పొట్టును నీళ్లలో నానబెట్టి, రాత్రంతా ఉంచి ఉదయం ఆ నీటిని గులాబీ మొక్కలకు పోస్తే, కొద్ది రోజుల్లోనే గులాబీ మొక్కలు ఎక్కువ పూలు పూస్తాయి.

ఇక గులాబీ మొక్కకు పేడ ఒక అద్భుతమైన ఎరువుగా పనిచేస్తుంది. గులాబీ మొక్క పాదులో కొద్దిగా మట్టిని తీసి, అక్కడ సూర్యరశ్మి బాగా తగిలేలా కాసేపు ఉంచి, అందులో కొద్దిగా పేడ వేసి, ఆపై మట్టితో కప్పివేయాలి. ఆ తరువాత నీటిని పోస్తూ ఉంటే పేడలో ఉండే పోషకాలు గులాబీ మొక్కకు అంది గులాబీలు బాగా పూస్తాయి.

ఇవి మనం ఇంట్లోనే సహజసిద్ధంగా చేసుకోగలిగిన ఫ్లవరింగ్ టిప్స్. కాబట్టి వర్షాకాలంలో గులాబీ మొక్కలను తెచ్చి ఇళ్లల్లో పెట్టుకుంటున్న వారు, బాగా గులాబీలు పూయాలని ఆశ పడేవారు, గులాబీ మొక్కల ప్రేమికులు మొక్కలు బాగా పూలు పూయడానికి ఈ టిప్స్ ను ఫాలో అయిపోండి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+