ఈ రాశివారికి విశేష ధనధాన్య యోగాలున్నాయి!
తెలుగు కొత్త సంవత్సరం ఉగాది రోజు నుంచి గ్రహాలు అనుకూలంగా మారి సిరిసంపదలనిస్తాయని, భోగభాగ్యాలనిస్తాయని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు నమ్ముతారు. ఈ ఏడాది ధనుస్సు రాశివారికి ఎలా ఉందో పరిశీలిద్దాం
వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 3గా ఉంది. ఖర్చు విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ ఏడాది ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. మీరు ఎదురు చూస్తున్న ఫలితాలు ఆశావహంగా వస్తాయి. విదేశీ ప్రయాణానికి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అదృష్టయోగం 75 శాతంగా ఉంది. మీలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆదరించేవారు పెరుగుతారు. విద్యార్థులు, ఉద్యోగస్తులకు బాగుంటుంది.
వ్యాపారం చేసేవారికి లాభాలున్నాయి. విశేష ధనధాన్య యోగాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదాన్ని పంచడంతోపాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. పనికి సంబంధించి సంకల్పసిద్ధి ఉంటుంది. ఈ రాశివారికి గురువు చతుర్థంలో ఉన్నాడు.

దీనివల్ల ఏప్రిల్ 22వ తేదీ వరకు మిశ్రమ ఫలితాలందుకుంటారు. 23వ తేదీ నుంచి మాత్రం పంచమంలో బ్రహ్మాండమైన అదృష్టయోగాన్ని పొందొచ్చు. తృతీయంలో ఉన్న శని విశేషమైన కార్యసిద్ధిని ప్రసాదిస్తాడు. దీనివల్ల బంగారు భవిష్యత్తుకు బాటలు పడతాయి. అక్టోబరు 31వ తేదీ వరకు పంచ స్థానంలో ఆ తర్వాత చతుర్థ స్థానంలో ఇబ్బందికర ఫలితాలు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు మీరు రాహు శ్లోకం చదువుకుంటే విఘ్నాలు తొలగుతాయి. అక్టోబరు 31వ తేదీ వరకు కేతువు ఏకాదశంలో, నవంబరు నుంచి దశంలో సంచరిస్తాడు. దీనివల్ల మంచి శుభఫలితాలు వస్తాయి. కేతువ వల్లే విశేష అదృష్ట యోగం లభిస్తుంది.
మకర రాశివారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6 గా ఉంది.
ఈ రాశివారి స్థిరాస్తులు పెరుగుతాయి. అదృష్ట యోగం 50 శాతంగా ఉంది. విద్యార్థులకు మిశ్రమంగా ఉంది. పట్టుదలగా చెమటోడ్చి పనిచేసినప్పుడే గ్రహాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు కూడా మిశ్రమ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులు సకాలంలో పనులు పూర్తిచేయడంతోపాటు వ్యాపారస్తులు నూతన ప్రయత్నాలు చేయాలి. కుటుంబ సభ్యులతో అనురాగంగా నడుచుకోవాల్సి ఉంటుంది.
ఏప్రిల్ 22వ తేదీ తర్వాత అర్ధాష్టమ బృహస్పతి యోగం ఇక్కట్లను కలిగిస్తుంది. కేవలం మనోబలంవల్లే లక్ష్యాలను సాధించగలుగుతారు. ఏలినాటి శని దోషంవల్ల ఆటంకాలుంటాయి. శని శ్లోకం చదువుకోవాలి. అక్టోబరు 31వ తేదీ వరకు విఘ్నాలు కలిగిస్తాడు రాహువు. నవంబరు నుంచి శుభఫలితాలుంటాయి. దశమంలో ఉన్న కేతువు అక్టోబరు 31వ తేదీ వరకు విజయాన్ని ఇస్తాడు. ఆ తర్వాత శ్రమ పెరిగిద్ది. కేతు శ్లోకం పఠించాలి.
నోట్: ఇతర రాశుల ఫలితాలు కావల్సినవారు ఈ క్రింది లింకుల్లో చూడగలరు.












Click it and Unblock the Notifications