Sankranti 2024: శుక్రుడి దయతో మకర సంక్రాంతి నుండి ఈ రాశులవారికి లక్ష్మీ కటాక్షం!!
మరికొద్ది రోజుల్లో మకర సంక్రాంతి పర్వదినం రాబోతుంది. ధనుర్మాసం అయిపోయి శుభకార్యాలు జరిగేందుకు ముహూర్తాలు కూడా వచ్చే సమయం ఆసన్నమైంది. మకర సంక్రాంతి సందర్భంగా సూర్యుడు రాశి మారనుండడంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుండగా, ఇదే సమయంలో శుక్ర గ్రహం సూర్యుడు ఉండే మకర రాశిలోకి ప్రవేశించడంతో ముఖ్యంగా కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని చెబుతున్నారు.
మేషరాశి
మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. సంక్రాంతి పండుగ నుండి వీరికి బాగా కలిసి వస్తుంది. సమాజంలో వీరి గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఇంట్లో సంతోషం వెల్లి విరుస్తుంది. ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా ఈ మాసం చాలా శుభాలను కలిగిస్తుంది. ఏ పని చేపట్టిన విజయం తధ్యంగా ఉంటుంది.

మిధునరాశి
మకర రాశిలోకి శుక్ర సంచారం మిధున రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలలో వీరు ఆర్థిక ప్రగతిని చూస్తారు. ఈ సమయంలో ధన లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా కాలం గడుపుతారు. ఈ సమయంలో ఏ పనులు అనుకున్న అవి దిగ్విజయంగా పూర్తవుతాయి.
సింహరాశి
సింహ రాశి వారికి మకర రాశిలో శుక్ర సంచారం అదృష్టాన్ని తీసుకువస్తుంది. మీరు ఏ పని తలపెట్టిన తిరిగే ఉండదు. శివుని ప్రత్యేకమైన అనుగ్రహంతో మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. కుటుంబంలో సామరస్య పూర్వక వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితం కూడా ఆనందదాయకంగా ఉంటుంది.
కన్యారాశి
శుక్ర గ్రహ సంచారంతో కన్యా రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. మీరు ఎక్కడ పని చేసినా అక్కడ శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో సంతోషం వెల్లి విరుస్తుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఏ పని తలపెట్టిన విజయం మీదే అవుతుంది. ఈ నెలాఖరులో శుభవార్తను వినే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications