సఫల ఏకాదశి.. డిసెంబర్ 26నుండి వీరికి మహారాజ యోగం వరమిచ్చిన విష్ణువు!
మార్గశిర మాసం శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన మాసం. ఈ మాసంలో వచ్చే సఫల ఏకాదశి చాలా ముఖ్యమైనది. ఈ ఏకాదశి రోజున మనం చేసే అనేక పనులు మనకు విష్ణువు కటాక్షాన్ని కలిగిస్తుందని చెబుతారు. సఫల ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం చేసి విష్ణువుని పూజిస్తారో వారికి చేసిన పాపాలు పోయి పుణ్యగతులు ప్రాప్తిస్తాయని చెబుతారు. అటువంటి సఫల ఏకాదశి ఈ సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన వచ్చింది.
డిసెంబర్ 26వ తేదీన సఫల ఏకాదశి
డిసెంబర్ 25వ తేదీన రాత్రి 10 గంటల 29 నిమిషాలకు ఇది ప్రారంభమై, డిసెంబర్ 27వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల వరకు ఉంటుంది. అయితే సాధారణంగా ఉదయం వచ్చిన తిథినే ప్రామాణికంగా తీసుకుంటాం. కాబట్టి డిసెంబర్ 26వ తేదీన సఫల ఏకాదశిని జరుపుకుంటున్నాం. అయితే సఫల ఏకాదశి రోజున జరిగే గ్రహసంచారం కారణంగా కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు వస్తున్నాయి. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేష రాశి
మేష రాశి వారికి సఫల ఏకాదశి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మేష రాశి వారికి విజయాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో మేష రాశి వారు నూతన గృహాలను, వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహంతో మేష రాశి వారు ఈ సమయంలో సంపన్నులు అవుతున్నారు. విద్యార్థులకు కూడా ఇది అనుకూల సమయం.
సింహరాశి
సింహ రాశి వారికి సఫల ఏకాదశి చాలా శుభ ప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో సింహ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది అన్ని విధాలా కలిసొస్తుంది. చాలాకాలంగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధువుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.
తులారాశి
తులారాశి వారికి సఫల ఏకాదశి అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో తులారాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను నిర్వర్తించవలసి వస్తుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు. తులా రాశి వారి అదృష్టానికి ఇది పూర్తి మద్దతు ఇస్తుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం కలుగుతుంది. చాలా సంవత్సరాలుగా నిలిచిపోయిన డబ్బు ఈ సమయంలో చేతికి వస్తుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ప్రేమించిన వారితో ఈ సమయంలో సంతోషంగా జీవిస్తారు. ఇది ధనుస్సు రాశి వారికి అదృష్ట సమయం.
మీనరాశి
మీన రాశి వారికి ఈ సంవత్సరంలో సఫల ఏకాదశి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇది కొత్త పనులను ప్రారంభించడానికి అనుకూల సమయం. ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ఇది మీన రాశి వారికి కలిసి వచ్చే సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications