అత్యంత అరుదైన సర్వార్థ సిద్ధియోగం.. వీరికి సంపదల ఖజానా పంపిన గణనాధుడు!
2025 సంవత్సరంలో అనేక గ్రహాల గమనంలో మార్పులు రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇక గ్రహాల సంచారంతో పాటు గ్రహాలు వివిధ రాశులలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వేరే గ్రహాలతో సంయోగం చెందడం వల్ల కొన్ని విశేష యోగాలు ఏర్పడతాయి. ఆ యోగాలు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తాయి.
సర్వార్ధ సిద్ధి యోగం
అయితే 2025 సంవత్సరంలో వేగంగా రాశిని మార్చుకునే చంద్రుడు కుంభరాశి లోకి వెళుతున్నాడు. శని అప్పటికే కుంభరాశిలో ఉండడం వల్ల సర్వార్ధ సిద్ధియోగం ఏర్పడుతుంది. ఈ సర్వార్థ సిద్ధి యోగం వివిధ రాశుల వారి జీవితాలలో గణనీయమైన మార్పులు తీసుకువస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మిధున రాశి
మిధున రాశి వారికి సర్వార్థ సిద్ది యోగం అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూసే మిధున రాశి వారికి ఈ యోగం కారణంగా లబ్ధి జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. నూతన ఆదాయ మార్గాలు పుంజుకుంటాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి ప్రయోజనాలు ఉంటాయి. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి సర్వార్ధ సిద్ధియోగం కారణంగా లబ్ధి జరుగుతుంది. ఈ రాశి వారి ధన ప్రవాహం పెరుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. అవివాహితులకు వివాహం అవుతుంది. భవిష్యత్తు కలలను సహకారం చేసుకోవడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. అయితే ఈ సమయంలో పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
మకర రాశి
సర్వార్థ సిద్ధి యోగం కారణంగా మకర రాశి వారికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. మకర రాశి వారికి వ్యాపారంలో లాభాలు వస్తాయి. రుణ బాధల నుండి మకర రాశి వారు విముక్తి పొందుతారు. సంపదలు పెరుగుతాయి . వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సుఖంగా గడుపుతారు.
వృశ్చిక రాశి
సర్వార్థ సిద్ధి యోగం కారణంగా వృశ్చిక రాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ సమయంలో వృశ్చికరాశి వారు విదేశీయానాలు చేస్తారు. వృశ్చిక రాశి వారి వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. వీరి ఆర్థిక పురోగతి మెరుగుపడుతుంది. అయితే వృశ్చిక రాశి వారు ఈ సమయంలో ఎవరికైనా ఆర్థిక సహాయం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications