జులై 13నుండి నవంబర్ 28వరకు 138రోజులు వీరికి తిరుగేలేదన్న శనిదేవుడు

వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం ద్వాదశ రాశులను ప్రభావితం చేస్తాయి. ఇక జ్యోతిష్య శాస్త్రంలో చాలా ముఖ్యమైన గ్రహంగా భావించే, నిదానంగా సంచరించే గ్రహంగా భావించే శనిదేవుడు రెండున్నర ఏళ్లకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాడు. కర్మలకు అధిపతిగా భావించే శని దేవుడు అన్ని రాశుల వారి జీవితాలు పైన తనదైన మార్క్ చూపిస్తాడు.

శని తిరోగమన సంచారం
అటువంటి శని దేవుడు ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్నాడు. త్వరలోనే శని తిరోగమనంలో సంచారం చేయబోతున్నాడు. జూలై 13వ తేదీన శని తిరోగమన సంచారాన్ని ప్రారంభించి నవంబర్ 28వ తేదీ వరకు తిరోగమనం చేయనున్నాడు. శని తిరోగమనం కారణంగా 138 రోజులపాటు కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు వారు ఎవరు? అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

satrun retrograde for 138 days these zodiac signs will get wealth and health

కన్యారాశి
మీన రాశిలో శని గ్రహ తిరోగమన సంచారం కన్యా రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. కన్యా రాశి జాతకులకు ఈ సమయంలో ఏ పని చేసినా విజయలక్ష్మి వరిస్తుంది. వర్తక, వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో కలిసి వస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి.కన్యా రాశి జాతకులు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఇది ఆర్ధిక పురోగతి కలిగించే సమయం.

మకర రాశి
మకర రాశి జాతకులకు శని తిరోగమన సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది . మకర రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా శుభాలే జరుగుతాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతును పొందుతారు. ఆర్థికంగా ఈ సమయంలో మకర రాశి వారికి కలిసి వస్తుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. విద్యార్థులకు ఈ సమయంలో చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. వర్తక, వ్యాపారాలు చేసేవారికి, ఉద్యోగులకు లాభదాయకంగా ఉంటుంది.

మీనరాశి
మీన రాశి జాతకులకు శని తిరోగమన సంచారం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో విదేశాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి.జీవితంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మీన రాశి వారికి కెరీర్ లో పురోగతి ఉంటుంది. విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. ఇది మీనరాశి జాతకులకు మంచి సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+