మార్చి నుండి వీరి ఇళ్ళు బంగారం చేస్తామని శపథం చేసిన శని, రాహువులు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతీ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది . 2025 సంవత్సరంలో ముఖ్య గ్రహాల సంచారం , ముఖ్య గ్రహాల సంయోగాలు అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా 2025 సంవత్సరంలో కుంభరాశి నుంచి శని మీనరాశిలోకి మార్చి నెలలో సంచారం చేస్తున్నాడు.
శని రాహువుల సంయోగం
శని మీనరాశిలోకి మార్చి 29వ తేదీన సంచారం చేస్తాడు. అయితే అప్పటికే అక్కడ ఉన్న రాహువుతో శని సంయోగం అవుతాడు. 30 ఏళ్ళ తర్వాత మీనరాశిలో శని రాహువుల అరుదైన కలయిక కొన్ని రాశులవారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. శని, రాహువుల కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి సంపదల వర్షం కురుస్తుంది. ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి
శని, రాహువుల సంయోగం కారణంగా మేష రాశి వారికి అన్ని విధాలా లబ్ది జరుగుతుంది. ఇది మేషరాశి వారికి శుభ కాలం. మేషరాశిలో 12వ స్థానంలో రాహువు శనితో కలవటం కారణంగా ఈ సమయం మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులు కొత్త పనులను ప్రారంభిస్తే మంచి జరుగుతుంది. మేషరాశి వారికి ఈ ఏడాది చివరి వరకు ఆర్ధికంగా ఇబ్బందులు ఉండవు. మేషరాశి వారి వైవాహిక జీవితం కూడా సంతోషదాయకంగా ఉంటుంది.
వృషభరాశి
శని, రాహువుల సంయోగం కారణంగా వృషభరాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. వృషభ రాశిలో 12 వ స్థానంలో శనితో రాహువు కలవటం కారణంగా వృషభ రాశి జాతకులకు మంచి ఫలితాలు వస్తాయి. వృషభ రాశి వారి చిరకాల కోరికలు తీరుతాయి. ధనార్జనా మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగం చేసేవారు పనిలో పురోగతి సాధించి ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. ఇది వృషభ రాశి వారికి అదృష్ట సమయం.
తులా రాశి
శని, రాహువుల సంయోగం కారణంగా తులా రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో సుఖంగా రాజభోగాలతో తులతూగుతారు. కుటుంబ జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. తులారాశి వారి దాంపత్య జీవితం చాలా ఆనందంగా సాగుతుంది. ఇది తులారాశి వారికి సంపదలను ఇచ్చే సమయం. వ్యాపారంగంలో ఉన్నవారు మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. 2025లో తులారాశి వారు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది.
కుంభరాశి
రాహు, శని కలయిక కారణంగా కుంభరాశి వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో కుంభరాశి జాతకులు అన్ని విధాలా శుభ ప్రయోజనాలను పొందుతారు. వర్తక, వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఇది అన్ని విధాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications