రాసిపెట్టుకోండి.. వీరికి కోటీశ్వర యోగం అంటున్న శని శుక్రులు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాలు సంయోగం కారణంగా రాశుల వారి జీవితాలు ప్రభావితం అవుతాయి. ఇక మీనరాశిలో శుక్ర శని గ్రహాల కలయిక కారణంగా అన్ని రాశుల వారి పైన ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి శుక్ర శని గ్రహాలు కలయిక శుభయోగాలను ఇస్తుంది. మార్చి 28వ తేదీన 9 గ్రహాలలోను కర్మదేవుడైన శని దేవుడు మీనరాశిలో సంచారం చేస్తాడు.
30 సంవత్సరాల తర్వాత మీన రాశిలో శని శుక్రుల కలయిక
ఇక అప్పటికే మీనరాశిలో సంచారం చేస్తున్న శుక్ర భగవానుడితో శని దేవుడు కలుస్తాడు. 30 సంవత్సరాల తర్వాత మీన రాశిలో శని శుక్రుల కలయిక జరుగుతుంది. మీన రాశిలో శని శుక్రుల కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశిలో 11వ స్థానంలో శుక్ర, శని గ్రహాల కలయిక చోటు చేసుకోవడం వల్ల వృషభ రాశి వారికి కలిసి వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించేందుకు మంచి సమయం నూతన ఆదాయ మార్గాలు ఈ సమయంలో కనిపిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో మంచి పురోగతి ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి లాభాలు వస్తాయి. ప్రేమజీవితం, కుటుంబ జీవితం బాగుంటుంది. ఈ సమయంలో ఏ పని చేసిన అదృష్టం వెన్నంటే ఉంటుంది.
మకర రాశి
మకర రాశిలో మూడవ ఇంట్లో శని శుక్ర సంయోగం జరుగుతుంది. శని శుక్ర గ్రహాల కలయిక కారణంగా మకర రాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధువులతో సంతోషంగా గడుపుతారు. ఎప్పటినుంచో వసూలు కాని మొండి బాకీలు వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. తోబుట్టువులు చాలా సంతోషంగా ఉంటారు
మీనరాశి
మీన రాశి వారి మొదటి ఇంట్లో శని శుక్రుల కలయిక కారణంగా ఇతరుల పట్ల గౌరవం పెరుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు ఏ పని చేసిన శుభమే జరుగుతుంది. ఆకస్మికంగా ధన లాభం కలుగుతుంది. పెండింగ్లో ఉన్న డబ్బులు చేతికి అందుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications