శని కటాక్షంతో 252రోజులు వీరికి మహారాజయోగం
నవగ్రహాలలో ముఖ్యమైన గ్రహంగా భావించే శని కర్మదేవుడు శని క్రమశిక్షణను న్యాయాన్ని సూచించే దేవుడు చెడు పనులు చేసిన వారికి శని కష్టాలను మంచి పనులు చేస్తున్న వారికి శని శుభాలను చేకూరుస్తాడు అందుకే జ్యోతిష శాస్త్రంలో శని దేవుడికి చాలా ప్రత్యేకమైన స్థానముంది. శని ప్రతి రెండున్నర సంవత్సరాలకు తన రాశిని మార్చుకుంటాడు.
శని కటాక్షం ఉండే రాశులు
ప్రస్తుతం శని తన మూలత్రికోణ రాశి అయిన కుంభరాశిలో ఉన్నాడు. వచ్చే సంవత్సరం శని మళ్లీ తన రాశిని మార్చుకుంటాడు. 2025 మార్చి 28వ తేదీ వరకు శని కుంభరాశిలో ఉంటాడు. శని కుంభరాశిలో ఉన్న సమయంలో 252 రోజులు ఆయన దయ పుష్కలంగా ఉండే రాశులను గురించి తెలుసుకుందాం. శనికటాక్షం కారణంగా కొన్ని రాశుల వారికి అఖండ ధనయోగం కలుగుతుంది. ఈ సమయంలో వారు అపార విజయాలను సాధిస్తారు.

మేష రాశి
శని సంచారం కారణంగా మేష రాశి వారికి రానున్న 252 రోజులు అదృష్టం కలిసొస్తుంది. శని శుభ ప్రభావం కారణంగా ఈ సమయంలో మేషరాశి జాతకులు ఏ పనులు చేసిన విజయాలను సాధిస్తారు. సమాజంలో మేషరాశి జాతుకుల పేరు, ప్రతిష్టలు ఈ సమయంలో పెరుగుతాయి. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. వీరికి ఈ సమయంలో మహారాజయోగం కలుగుతుంది.
సింహరాశి
రాబోయే 252 రోజులు సింహ రాశి వారికి అదృష్ట కాలం. ఈ సమయంలో వీరికి ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది వీరికి సరైన సమయం. ఆర్థికంగా గణనీయమైన పురోగతి ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ప్రేమ సంబంధిత వ్యవహారాలలో చోటుచేసుకున్న ఇబ్బందులు సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంటారు. వీరికి ఈ సమయంలో ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.
తులారాశి
రాబోయే 252 రోజులు తులా రాశి వారికి శుభ సమయం. కుంభరాశి లో శని సంచారం కారణంగా తులా రాశి జాతకులకు ఆర్థికంగా లబ్ధి జరుగుతుంది. ఆరోగ్యంలో కొన్ని ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త. విద్యార్థులు ఈ సమయంలో శుభవార్తలు వింటారు.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications