ప్రత్యక్షంగా మారి ఈ రాశులవారికి సంపదలను ఇచ్చే శనిదేవుడు.. ఎప్పుడంటే
వేద జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవుడిని కర్మలకు అధిపతిగా భావిస్తారు. శని దేవుని న్యాయ దేవుడి గాను, సహనాన్ని నేర్పే దేవుడు గాను భావిస్తారు. అటువంటి శనిదేవుడు కుంభ, మకర రాశులకు అధిపతి. చాలా నిదానంగా సంచారం చేసే దేవుడు ఆయన శనిదేవుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశిని మారుస్తూ సంచారం చేస్తాడు. ఈ విధంగా శని దేవుడు ద్వాదశరాశులను పూర్తి చేయడానికి సుమారు 30సంవత్సరాల కాలం పడుతుంది.
శని ప్రత్యక్ష సంచారం
ఇక శని దేవుని సంచారం ప్రస్తుతం మీనరాశిలో సాగుతుంది. శని జూలై 13వ తేదీన తిరోగమన సంచారం ప్రారంభించి నవంబర్ 28వ తేదీ వరకు తిరోగమనం లోనే సంచరించనున్నాడు. ఆపై నవంబర్ 28వ తేదీన ప్రత్యక్షంగా మారి సంచరిస్తాడు. దీని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలుగుతుంది. శని ప్రత్యక్ష సంచారం కారణంగా కలిసివచ్చే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

కుంభరాశి
కుంభ రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం కారణంగా కలిసి వస్తుంది. ఈ సమయంలో కుంభ రాశి వారికి ఎన్నో విజయాలు సొంతమవుతాయి. ఏ పని చేపట్టిన సకాలంలో పూర్తి చేయగలుగుతారు. తోబుట్టువుల నుంచి సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. ఈ సమయం కుంభ రాశి వారు కష్టాలను అధిగమించి ముందుకు సాగగలుగుతారు. కుంభ రాశి వారి కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు.
వృషభ రాశి
వృషభ రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరు ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఉద్యోగాలు చేసే వారి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ జీవితం సంతోషదాయకం గా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఇది వృషభ రాశి వారికి మంచి సమయం.
మీనరాశి
శని ప్రత్యక్ష సంచారం కారణంగా మీన రాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. సమయంలో మీనరాశి జాతకులు మంచి ప్రయోజనాలను పొందుతారు. వీరికి ఆర్థికంగా లాభాలు వస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో సుఖమైన జీవితం ఉంటుంది. అన్ని విధాల మీన రాశి వారికి కలిసి వస్తుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. వ్యాపారం లోను లాభాలు వస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications