వీరికి సంపదల ఖజానా పంచుతున్న శని.. వీరి స్టార్ మాములుగా లేదుగా!
శనిదేవుడు కర్మదేవుడు. నవగ్రహాలలో శని గ్రహానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. శని ఒక రాశి నుండి మరొక రాశికి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి సంచారం చేస్తుంది. శని రాశులనే కాదు నక్షత్రాలను కూడా మారుస్తూ ముందుకు సాగుతుంది. శని నక్షత్ర సంచారం కూడా కొన్ని రాశులవారికి శుభ ఫలితాలను, కొన్ని రాశులవారికి అశుభ ఫలితాలను ఇస్తుంది.
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం
శనిదేవుడు ప్రస్తుతం ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. శని దేవుడు అక్టోబర్ మూడో తేదీ వరకు ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం చేస్తాడు. శని దేవుడు అక్టోబర్ మూడో తేదీన పూర్వాభాద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. శని ఉత్తరాభాద్ర నక్షత్ర సంచారం కొన్ని రాశులవారికి శుభ ఫలితాలను ఇస్తుంది. శని నక్షత్ర సంచారంతో లబ్ధిని పొందే రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం కారణంగా వృషభరాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారుతున్నారు. శని వృషభ రాశిలో 11వ స్థానంలో సంచరిస్తూ వీరికి శుభాలను కలిగిస్తున్నాడు. ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు ఆర్ధిక ప్రయోజనాలు కలుగుతాయి. వారి కుటుంబ సమస్యలు తీరుతాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ లు వస్తాయి. ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపారవేత్తలకు ఇది లాభాలను చేకూరుస్తుంది.
మిధున రాశి
మిధునరాశి జాతకులకు శని నక్షత్ర మార్పు అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. మిధునరాశి జాతకులకు ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు మంచి ప్రయోజనాలను ఇస్తాయి. సంతానం నుండి శుభవార్తలు వింటారు. కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆర్ధికంగా మిధున రాశి వారు బలోపేతం అవుతారు.
తులారాశి
శని నక్షత్ర మార్పు తులారాశి జాతకులకు కలిసి వస్తుంది. తులారాశిలో శని 6వ ఇంట్లో సంచారం చేచేయటం కారణంగా తులా రాశి జాతకులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది.తులా రాశి వారికి నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఈ సమయంలో వీరి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వీరి శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. పూర్వీకులకు సంబంధించి ఆస్తులు వచ్చే అవకాశం ఉంటుంది. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. ధనుస్సు రాశి వారికి వ్యాపార విస్తరణకు కూడా ఇది మంచి సమయం. ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగాలు చేసే వారు పదోన్నతులు పొందుతారు. వీరి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది.
మకర రాశి
ఉత్తరాభాద్ర నక్షత్రం లోకి శని సంచారం కారణంగా మకర రాశి వారికి కలిసి వస్తుంది. వీరికి ఏ పని చేసిన సానుకూల ఫలితాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. మకర రాశి జాతకులు ఈ సమయంలో కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. మకర రాశి వారి గౌరవం పెరుగుతుంది. తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications