Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కుంభరాశిలో శని ఉదయం: ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం!!

వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. శని గ్రహం మార్చి 18వ తేదీన కుంభ రాశిలో ఉదయిస్తుంది. శని ప్రతి రెండున్నర ఏళ్ల తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్తాడు. క్రమశిక్షణతో కూడిన శని గ్రహం వివిధ రాశుల వారి జాతకాలలో మంచి స్థానంలో ఉంటే శుభ ఫలితాలను, చెడు స్థానంలో ఉంటే అశుభ ఫలితాలను పొందుతారు.

కుంభ రాశిలో శని ఉదయం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. జాతకంలో శని యొక్క శుభ స్థానం వల్ల ఆయా రాశుల వారి జీవితాలలో సంపద మరియు మంచి ఫలితాలు వస్తాయి. 30సంవత్సరాల తర్వాత ప్రస్తుతం కుంభ రాశిలో శని ఉదయించబోతున్నాడు. ఇది ముఖ్యంగా కొన్ని రాశులకు శుభకాలాన్ని సూచిస్తుంది. కుంభరాశిలో శని ఉదయించడం కారణంగా అదృష్టం కలిసి వచ్చే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

saturn rise in aquarius: wealth and luck for these 3 zodiac signs!!

కుంభరాశిలో శని ఉదయించడం మేష రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మేష రాశి వారికి ఈ సమయంలో అధిక ఆదాయాలు, పెట్టుబడులు వస్తాయి. మేషరాశిలో శని 11వ ఇంట్లో ఉదయించడం వల్ల మేష రాశి జాతకులకు ఆదాయ వనరులు పెరుగుతాయి. శని శుభ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది.

ఉద్యోగుల జీతాల పెంపుకు ఇది సరైన సమయం. స్టాక్ మార్కెట్ల వారికి లాభాలు వస్తాయి. లాటరీల ద్వారా డబ్బులు సంపాదించాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. కుంభరాశిలో శని ఉదయించటం సింహరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయం సంబంధిత పెట్టుబడులు పెట్టటానికి సరైన సమయం. పెండింగ్ లో ఉన్న కోర్టు కేసుల్లో విజయం సాధించే అవకాశం ఉంది.

పెట్టుబడుల ద్వారా ఆదాయం ఆర్జించటానికి ఇదే సరైన సమయం. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార వర్గాలకు కూడా లాభాలకు చాన్స్ ఉంటుంది. ఈ సమయంలో ఏ పని చేసినా సానుకూల ఫలితాలు ఉంటాయి. కుంభరాశిలో శని ఉదయం కుంభరాశి జాతకులకు గొప్ప ఫలితాలను అందిస్తుంది. శని కుంభరాశికి అధిపతి కావటంతో శని దేవుడి ఆశీర్వాదం కుంభరాశి వారిపై ఉంటుంది.

శని కారణంగా ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు లభిస్తాయి. కుంభ రాశి వారికి వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి మరియు మంచి లాభాలను ఆర్జించడానికి ఇది ఉత్తమ సమయం. శని కుంభరాశిలో శష్ రాజయోగాన్ని సృష్టించటం వలన పెండింగ్ పనులను పూర్తి చెయ్యటానికి ఇది ఉత్తమ అవకాశం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+