శని సంచారంతో పాటు సూర్యగ్రహణం.. వందేళ్ళ తర్వాత ఖగోళ అద్భుతం, వీరిదే సంపన్నయోగం!
వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి అన్న విషయం తెలిసిందే. అయితే మార్చి నెలలో జరగనున్న గ్రహాల సంచారం చాలా అద్భుతమైన ఖగోళ దృశ్యాలకు వేదిక కానుంది. వందేళ్ల తర్వాత మహా అద్భుతం జరగబోతోంది .
శని సంచారంతో పాటు సూర్య గ్రహణం
శనిగ్రహం మార్చి 29వ తేదీన కుంభరాశిని వదిలి నేరుగా మీన రాశిలోకి ప్రవేశించబోతుంటే అదే రోజున సూర్య గ్రహణం ఏర్పడుతుంది. వందేళ్ల తర్వాత ఇలా ఒకే తేదీన రెండు యాదృచ్ఛికాలు జరగబోతున్న నేపథ్యంలో కొన్ని రాశుల వారు అదృష్టవంతులుగా మారుతున్నారు. వీరు అన్ని విషయాలలోనూ శుభ ఫలితాలను చూడబోతున్నారు. ఇక ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మిధున రాశి
మిధున రాశి వారికి సూర్యగ్రహణం ప్రభావం కొంత మేలు చేస్తుంది. ఇక ఇదే సమయంలో శనిసంచారం మిధున రాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది. వీరికి ఆర్థికపరమైన అంశాలలో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. మిధున రాశి వారు చాలాకాలంగా వస్తున్న సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి సూర్యగ్రహణ ప్రభావం మేలు చేకూరుస్తుంది. ఇదే సమయంలో శని సంచారం వల్ల వీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. పిల్లలు లేని వారికి ఈ సమయంలో సంతాన యోగం కలిగే అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారికి విముక్తి లభిస్తుంది.
తులారాశి
శని సంచారంతో పాటు సూర్యగ్రహణం ప్రభావం వల్ల తులా రాశి జాతకులు అదృష్టవంతులుగా మారుతున్నారు. ఈ సమయంలో తులా రాశి వారు ఏ పని చేసినా కలిసి వస్తుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. అలాగే ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల విశేషమైన ప్రయోజనాలు వస్తాయి. తులా రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది.
మీన రాశి
శని సంచారం తో పాటు సూర్యగ్రహణం ఏర్పడడం వల్ల మీన రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మీనరాశి వారు ఆర్థికంగా బలంగా నిలబడగలుగుతారు. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు వస్తాయి. మీన రాశి వారు ఎటువంటి పనులలోనైనా విజయాలను సాధిస్తారు. ఇది వీరికి అదృష్టాన్ని ఇచ్చే కాలం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications