శని సంచారంతో పాటు సూర్యగ్రహణం.. ఈ రాశులవారికి సంపదల వర్షం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితం పైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే మార్చి నెలలో కొన్ని గ్రహాల సంచారం చాలా అద్భుతమైన ఖగోళ దృశ్యాలకు వేదిక అవుతుంది. ప్రస్తుతం శని గ్రహం మార్చి 29వ తేదీన కుంభరాశిని వదిలి మీన రాశిలోకి ప్రవేశించబోతుంది. అదేరోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
వందేళ్ళ తర్వాత రెండు యాధృచ్చికాలు
100 సంవత్సరాల తర్వాత ఒకే తేదీన 2 యాదృచ్ఛికాలు జరగబోతున్న క్రమంలో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వారు అన్ని విధాలా ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఆ రాశులు ఏమిటి అన్నది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మిధునరాశి
సూర్యగ్రహణంతోపాటు శని సంచారం కారణంగా మిధున రాశి వారికి మేలు జరుగుతుంది. ఇది మిధున రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అనేక ఆర్థికపరమైన అంశాలలో మిధున రాశి వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఎంతో కాలంగా వస్తున్న సమస్యలకు ఈ సమయంలో చక్కని పరిష్కార మార్గాలు లభించే అవకాశం ఉంది.
ధనస్సురాశి
ధనస్సు రాశి వారికి సూర్యగ్రహణ ప్రభావం మంచి సానుకూల ఫలితాలను ఇస్తుంది. శని సంచారం కారణంగా వీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. పిల్లలు లేని వారికి ఈ సమయంలో సంతానయోగం కలిగే అవకాశం ఉంది. ఇది ధనుస్సు రాశి వారికి శుభ సమయం.
తులారాశి
శని సంచారంతో పాటు సూర్యగ్రహణ ప్రభావం వల్ల తులా రాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారుతున్నారు. ఈ సమయంలో తులా రాశి వారు ఏ పని చేసినా కలిసి వస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు విశేషమైన ప్రయోజనాలను ఇస్తాయి. తులా రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది.
మీనరాశి
శని సంచారం తో పాటు సూర్యగ్రహణం ఏర్పడడం కారణంగా మీన రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మీన రాశి వారు ఆర్థికంగా నిలబడతారు. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు వస్తాయి. మీన రాశి వారు ఎటువంటి పనులు చేసిన విజయాలను సాధిస్తారు. ఇది వీరికి అదృష్టాన్ని ఇచ్చే సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications