త్వరలో పులిపంజా చీల్చి కోటీశ్వరులయ్యే రాశులవారు వీరేనన్న శని!
వేద జ్యోతిష శాస్త్రంలో శని గ్రహం చాలా శక్తివంతమైన గ్రహంగా చెబుతారు. శని సంచారం చాలా నిదానంగా సాగుతుంది. ప్రస్తుతం శని సంచారం కుంభరాశిని వదిలి మీన రాశిలోకి జరగబోతుంది. మార్చి 29వ తేదీన శని మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మీనరాశిలో శని సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది.30 సంవత్సరాల తర్వాత శనిగ్రహం కుంభరాశిని వదిలి మీనరాశిలోకి ప్రవేశించబోతుంది.
మీనరాశిలో శని సంచారం
కుంభరాశి నుండి మీన రాశిలోకి శని సంచారానికి కదలిక మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఇదే రోజున హోలీ పండుగ కూడా రాబోతుంది. శని రెండున్నర సంవత్సరాల పాటు మీన రాశిలో ఉంటాడు. ఈ రెండున్నర సంవత్సరాలు కొన్ని రాశుల వారికి శని ఊహించని ధన లాభాలను కలిగిస్తాడు. శని కారణంగా ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలున్న ఆ రాశులు ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మకర రాశి
మీనరాశిలో శని సంచారం కారణంగా మకరరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా మకరరాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ధన లాభాలతో పాటు అనుకున్న పనుల్లో పురోగతిని సాధిస్తారు. గతంలో నిలిచిపోయిన డబ్బులు ఈ సమయంలో వసూలు అవుతాయి. వ్యాపారాల విస్తరణ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయం ఎంతో సహకరిస్తుంది. మకరరాశి వారు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టి ఈ సమయంలో వ్యాపారాలను విస్తరించవచ్చు.
మిధున రాశి
మిధున రాశి వారికి శని సంచారం కారణంగా శుభప్రదంగా ఉండబోతుంది. మిధున రాశి వారు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వ్యాపారాలు చేసే వారికి భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలను విస్తరించే అవకాశం ఉంది. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగాలు లేని వారికి కూడా ఈ సమయంలో మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
ధనస్సు రాశి
శని సంచారం ధనుస్సు రాశి వారికి చాలా శుభాలను చేకూరుస్తుంది. ధనస్సు రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఏ పని చేసినా విజయం సాధిస్తారు. ధనుస్సు రాశి వారి భౌతిక ఆనందం పెరగడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ సమయంలో ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి. అనేక జబ్బుల నుండి కూడా విముక్తి కలుగుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications