30ఏళ్ళ తర్వాత బుధుడి నక్షతంలోకి శనిదేవుడు.. వీరికి సంతోషాల బొనాంజా!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ అన్ని రాశులవారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అటువంటి గ్రహాలు దేనికవే చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. గ్రహాలలో ముఖ్య గ్రహమైన శని దేవుడు చాలా శక్తివంతమైన దేవుడు. ఆయన ప్రభావం ప్రతి ఒక్క జాతకుల జీవితాలపైన తప్పనిసరిగా ఉంటుంది.

రేవతి నక్షత్రంలోకి శనిదేవుడు

కర్మలకు అధిపతి, క్రమశిక్షణకు మారుపేరైన శని దేవుడు ఈ సంవత్సరం రేవతి నక్షత్రం లోకి ప్రవేశించబోతున్నాడు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత బుధుడి నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రంలోకి మే నెల 17వ తేదీన సంచారం చేయబోతున్నాడు. బుధుడు మరియు శని దేవుడు స్నేహపూర్వకమైన బంధాన్ని పంచుకునే గ్రహాలు కావడంతో శని సంచారం కొన్ని రాశుల వారి జీవితాలలో శుభప్రదంగా ఉంటుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

saturn transit into revati nakshatra after 30 years gives financial benefits to these zodiac signs

మిధున రాశి

శని నక్షత్ర మార్పు మిధున రాశి జాతకులకు ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో కెరీర్ లో ఉన్న అడ్డంకులను అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగాలు చేసేవారు కొత్త ఉద్యోగ అవకాశాలను,, ప్రమోషన్లు పొందుతారు. మీడియా, రచన, మార్కెటింగ్, ఐటీ రంగాలలో ఉన్నవారు గణనీయమైన ప్రయోజనాలను సాధిస్తారు. వ్యాపారవేత్తలు కొత్త ప్రాజెక్టులను పొందుతారు.

కన్యారాశి

శని నక్షత్ర మార్పు కన్యారాశి జాతకులకు అద్భుతమైన శుభాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో కన్యారాశి జాతకులు పదోన్నతులు పొందే అవకాశం ఉంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఫలితాలను సాధించగలుగుతారు.

మకర రాశి

శని నక్షత్ర మార్పు మకర రాశి జాతకులకు ప్రయోజనకరంగా నిరూపించబడుతుంది. దీనివల్ల మకర రాశి వారికి కెరీర్లో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ మరియు పరిపాలన సేవలలో ఉన్నవారు ఈ సమయంలో ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో వ్యాపార విస్తరణకు కూడా అవకాశాలు ఉంటాయి. విదేశాలకు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఇది మీ కోరికలు నెరవేరే సమయం.

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+