• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శని మకర సంక్రమణం: 6 మాసాలపాటు అన్ని రాశుల వారి జాతకాలు, రాశీఫలాలు

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

పుష్య బహుళ అమావాస్య జనవరి 24 తేదీ నుండి శని గ్రహం ధనుస్సు రాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించడం జరిగింది. ఇలా శని 2 సంవత్సరాల 6 మాసాలు ఒకే స్థానంలో ఉంటాడు. మకరరాశి శనీశ్వరునికి స్వక్షేత్రము. అనగా శని భగవానునికి సొంత ఇల్లు.మకరరాశివారికి శని జన్మ శని అవుతుంది. మేషాది ద్వాదశ రాశుల వారికి శనిగ్రహం స్థానం మారడం వలన ఎవరికీ ఏ విధమైన ఫలితాలనిస్తాడో గమనిద్దాం.

మేషరాశి :

మేషరాశి :

మేషరాశివారికి శని 10 వ స్థానం అవుతున్నాడు. ఈ రాశివారికి శని వలన మిశ్రమ ఫలితాలే ఉంటాయి. శుభాశుభాలు రెండూ ఉంటాయి. ఉద్యోగాలు అనుకూలం, నీచకార్యంపై ఆసక్తి పెరుగుతుంది జాగ్రత్తలు అవసరం. ఎక్కువ ఆందోళన అవసరంలేదు. పాకెట్ రక్షా యంత్రం దగ్గర పెట్టుకొండి. దైవానికి సంబంధించిన విషయంలో శ్రద్ధ ఎక్కువ చూపాలి.

వృషభరాశి

వృషభరాశి

వృషభ రాశి వారికి శని 9 వ స్థానం అవుతున్నాడు. ఈ రాశి వారికి శని వలన మిశ్రమ ఫలితాలే ఉంటాయి. శుభాశుభాలు రెండూ ఉంటాయి. అధికారుల వలన భాదలు, అనవసరంగా ప్రయాణాలు, తన ధర్మం తాను పాటించక పోవడం, ఆనారోగ్యం, ఎక్కువ ఆందోళన అవసరంలేదు. మనస్సున, మాటను అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. పాకెట్ రక్షా యంత్రం దగ్గర పెట్టుకొండి. వృద్దులకు, పెద్దలకు సేవలు చేయండి.

 మిథునరాశి

మిథునరాశి

మిథునరాశి వారికి శని 8 వ స్థానం అవుతున్నాడు. ఇది శనికి లోహ సంచార స్థానం. అష్ట కష్టాలు అంటాము కదా, అలా అనేక కష్టాలు ఉండే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు పాటించాలి. బంధువుల వలన భాదలు, కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలి, వాహానాలతో, వ్యాపార, ఉద్యోగం వ్యవహారాలలో జాగ్రత్తలు అవసరం రావిచెట్టుకు ప్రతిరోజూ 11 ప్రదక్షిణలు చేయండి, పాకెట్ రక్షా యంత్రం దగ్గర పెట్టుకొండి.

కర్కాటకరాశి

కర్కాటకరాశి

వీరికి శని 7 స్థానంలో అశుభుడుగా లోహపాదంతో సంచరిస్తాడు కనుక వీరు కూడా సరైన జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య, వాహణ, ఉద్యోగ , వ్యాపార వ్యవహారాలలో జాగ్రత్తలు పాటించాలి. పాకెట్ రక్షా యంత్రం దగ్గర పెట్టుకొండి. అనాధలకు ఎదో ఒకటి దాన ధర్మాలు తరచూ చేస్తూ ఉండండి.

సింహరాశి

సింహరాశి

వీరికి శని 6 వ స్థానములో సువర్ణమూర్తి అవుతాడు, స్వర్ణపాదంతో సంచరిస్తాడు. వీరికి ఈ కాలం చాలా మంచిది. అనుకున్న పనులు అన్నీ పూర్తి అవుతాయి. కుటుంబ సౌఖ్యం, ధనలాభం, ఆరోగ్యం కలుగుతుంది. పాకెట్ రక్షా యంత్రం దగ్గర పెట్టుకొండి. గోవులకు గ్రాసం వేయండి.

కన్యరాశి

కన్యరాశి

ఈ రాశి వారికి శని పంచమ స్థానంలో ఉంటున్నాడు. సాధారణ ఫలితాలు ఉంటాయి. పనులలో ఆటంకాలు కలుగుతాయి, అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. పాకెట్ రక్షా యంత్రం దగ్గర పెట్టుకొండి. గణపతికి గరికతో పూజ చేయండి. విష్ణు సహస్ర నామాలు చదువుకోండి, పేదవారికి భోజనం పెట్టండి.

తులరాశి

తులరాశి

ఈ రాశివారికి శని 4 వ స్థానములో ఉంటున్నాడు. దీనిని అర్ధాష్టమ స్థానం అంటారు. ఇది శనికి లోహ సంచార స్థానం. కావున సమస్యలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. పనులలో ఆటంకం, అనవసరమైన ఖర్చులు, జీవితభాగస్వామికి ఆరోగ్య సమస్యలు వచ్చె అవకాశాలు. పాకెట్ రక్షా యంత్రం దగ్గర పెట్టుకొండి. హనుమాన్ చాలీసా చదువుకోండి. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. పేద వారికి ఆహారానికి సహాయ పడండి.

వృశ్చికం

వృశ్చికం

వృశ్చిక రాశివారికి మొన్నటి వరకూ ఏలినాటి శని బాధలు ఉండేవి. ప్రస్తుతం ఆ కష్టాలు పోయాయి. ఇప్పుడు వీరికి బంగారు కాలం అని చెప్పాలి. శని 3 వ స్థానం అయిన సువర్ణ స్థానములో సువర్ణ మూర్తి అవుతున్నాడు. కార్యలాభం, అభివృద్ధి, ఆరోగ్యం కలుగుతుంది, మంచి సేవలు పొందుతారు, అన్నింటా అంతా జయమే కలుగుతుంది.పాకెట్ రక్షా యంత్రం దగ్గర పెట్టుకొండి. గోమాత ప్రదక్షిణలు చేయండి.

ధనుస్సురాశి

ధనుస్సురాశి

ఈ రాశి వారికి శని 2 వ స్థానంలో లోహ మూర్తి అయి ఉంటున్నాడు. వీరికి ఏలినాటి శని చివరి దశ ప్రారంభం అవుతుంది. ఆర్ధిక పరమైన చిక్కులు, ఆనారోగ్యం, అశాంతి కలుగుతుంది.వచ్చే సంక్రమణం లోపు వీరికి మంచి చేసే వెళ్తాడు. అయినా వీరు సరైన జాగ్రత్తలతోనే ఉండాలి. పాకెట్ రక్షా యంత్రం దగ్గర పెట్టుకొండి. రావి చెట్టు ప్రదక్షిణలు చేయండి. శివునికి తిలలతో అభిషేకం చేయండి.

మకరరాశి

మకరరాశి

ఈ రాశి వారికి జన్మ స్థానంలో అనగా 1 వ స్థానంలో ఉంటాడు. ఇది శనికి స్వక్షేత్రం. బందు విరోధాలు ఆనారోగ్యం ఏర్పడుతుంది, దూర ప్రయాణాలలో అలసట,ఆటంకములు కలుగుతాయి. ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. పాకెట్ రక్షా యంత్రం దగ్గర పెట్టుకొండి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను ఆహారంగా వేయండి.

కుంభరాశి

కుంభరాశి

ఈరాశివారికి వ్యయంలో అనగా 12 వ స్థానంలో ఉంటాడు. ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. శని మకరంలో రెండున్నర సంవత్సరాలు ఉండి ఆ తర్వాత కుంభరాశిలోకి రావడం జరుగుతుంది. కుంభరాశి కూడా శనికి స్వక్షేత్రమే. కనుక ఏలినాటి శని బాధలు ఎక్కువగా ఇబ్బంది పెట్టక పోయిననూ ఆనారోగ్యం, ధన నష్టం, వృధాశ్రమ, ఆందోళనలు కలుగుతాయి.పాకెట్ రక్షా యంత్రం దగ్గర పెట్టుకొండి. రావి చెట్టునకు ప్రదక్షిణలు చేయండి.

మీనరాశి

మీనరాశి

శని ఈ రాశివారికి 11 వ స్థానము 'లాభ' స్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ అనేక శుభాలను ఇస్తాడు. ఈ 11 వ స్థానం చేరడానికి శనికి 27 సం.ల 6 నెలల కాలం పడుతుంది. ఇంతటి సుదీర్ఘ కాలం తర్వాత 11 వ స్థానానికి వస్తున్నాడు కనుక పట్టిందల్లా బంగారమే. కుటుంబ సౌఖ్యం, గౌరవము, ధనలాభం కలుగుతుంది. పాకెట్ రక్షా యంత్రం దగ్గర పెట్టుకొండి. పేదలకు వస్త్ర దానం చేయండి.

గమనిక :- పైన తెలిపిన ఫలితాలు అన్ని గోచార ఫలాలు అంటారు. పన్నెండు రాశుల్లో వారి వ్యక్తీ గత జాతకరిత్య శని ఎవరికైతే శుభుడుగా ఉన్నాడో వారికి శుభఫలితాలు, అశుభుడుగా ఉంటే అశుభ ఫలితాలు రావడం అనేది మీజాతక చక్రం బట్టి ఇప్పుడు నడుస్తున్న దశ, అంతర్ధశలను బట్టి ఫలితాలు ఉంటాయి. జాతకంలో లగ్నం కుడా ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి మీ వ్యక్తీ గత జాతకం ఆధారంగా మంచి శుభ ఫలితాల కొరకు రేమిడిస్ తెలుసుకుని ఆచరిస్తే ఉపశాంతి లభిస్తుంది.

శని మంత్రం : -

1) ఓం ప్రాం ప్రీం ప్రౌం సం శనైశ్చరాయ నమ:

2) కోణస్త పింగళ బభ్రు:

కృష్ణో రౌద్రాంతకో యమ:

సౌరి శనైశ్చరో మంద:

పిప్పలాదేవ సంస్తుత:

3) నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం

ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం

పై మంత్రం రోజూ పఠించండి. నిత్యం గోవులకు ,పశు, పక్షాదులకు, అనాధలకు , వికలాంగులకు, వృద్ధులకు సేవలు చేయండి. మీ శక్తి కొలది వారికి దాన ధర్మాలు చేయండి శుభం కలుగుతుంది.

English summary
Saturn Transit or Shani Sankramanam into Zodaic sign. Saturn travels on zodaic Sign to other Zodaic sign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X