2025లో దహనస్థితిలోనే ఈ రాశులవారికి డబ్బులమూటలు పంపనున్న శని!

వేద జ్యోతిష శాస్త్రంలో క్రమశిక్షణకు మారుపేరైన శని గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. శని గ్రహం మిగతా గ్రహాల కంటే చాలా నిదానంగా ప్రయాణం చేసే గ్రహం. శని గ్రహాన్ని న్యాయదేవతగా కూడా చెబుతారు. అటువంటి శని గ్రహం సమయాన్నిబట్టి తన ప్రభావాన్ని చూపిస్తుంది. శని గ్రహ రాశి సంచారం అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తాయి.

2025లో దహన స్థితిలో కుంభరాశి నుండి మీనరాశిలోకి శని
వచ్చే సంవత్సరం శనిగ్రహం మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మార్చి 29వ తేదీన శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచారం ప్రారంభిస్తాడు. దహన స్థితిలో మీనరాశిలోకి వెళుతున్న శని ఆ తర్వాత మార్చి 31వ తేదీన ఉదయం 12:43 నిమిషాలకు మీనరాశిలో ఉదయిస్తాడు. దహన స్థితిలో మీనరాశిలోకి వెళ్లిన శని కొన్ని రాశులవారికి అదృష్టాన్ని ఇస్తున్నాడు . మరి శని దయ వల్ల అదృష్టవంతులు అవుతున్న ఆ రాశుల వారెవరో ప్రస్తుతం తెలుసుకుందాం.

Saturn will send bundles of money to these zodiac signs in 2025 even while in a state of combustion

తులారాశి
మీనరాశిలోకి శని సంచారం తులారాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. తులారాశి జాతకులు ఈ సమయంలో ఉద్యోగపరంగా మంచి ఫలితాలను చూస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి శని దయ వల్ల 2025సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి 2025 అనుకూలం. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. చట్టపరంగాను బోలెడు లాభాలు కలుగుతాయి. తులారాశి వారికి మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి 2025 సంవత్సరం అదృష్ట సమయం. కర్కాటక రాశి వారు వృత్తిపరమైన జీవితంలో ఊహించని ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో వీరు మంచి ఉద్యోగాలను పొందే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసొస్తుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగాను ఇది కర్కాటక రాశి వారికి మంచి సంవత్సరం.

మీన రాశి
మీనరాశిలో శని సంచారం మీన రాశి వారికి లబ్ధిని చేకూరుస్తుంది. ఉద్యోగాలు చేసే మీనరాశి జాతకులకు ఇది మంచి సమయం. మీనరాశి వారు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందే అవకాశం ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీనరాశి వారి కుటుంబ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే మీనరాశి జాతకులు ఈ సమయంలో విశేషమైన ప్రయోజనాలను పొందుతారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+