2025 చివరలో కొత్త మహమ్మారి: నోస్ట్రడామస్ జ్యోతిష్య అంచనా!
సృష్టిలో ఏ సంవత్సరం ఏం జరగబోతుందో అనేకమంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు గతంలోనే అంచనా వేశారు. అలా జ్యోతిషశాస్త్ర ఖచ్చితమైన అంచనాలతో ప్రజల మన్ననలు పొందిన వారిలో బాబా వంగ, నోస్ట్రాడామస్ ముఖ్యమైన వారు. ఇప్పటికే బాబా వంగ 2025 లో జరిగే అనేక సంఘటనలను గురించి తన జ్యోతిష్య శాస్త్ర అంచనాలను చెప్పారు. ఆమె చెప్పిన వాటిలో దాదాపు చాలా వరకు నిజమయ్యాయి.
డిసెంబర్ లో భయానకం.. చెప్పిన నోస్ట్రడామస్
నోస్ట్రడామస్ కూడా 2025 సంవత్సరం ముగింపు ఏ విధంగా ఉండబోతుందో తన జ్యోతిష్య శాస్త్ర అంచనాలలో వెల్లడించారు. ఈసారి 2025 సంవత్సరం ముగింపు అందరిలో ఆశ కంటే ఆందోళనను రేకెత్తిస్తుంది. 2025 చివరి నెల డిసెంబర్ మానవాళి చరిత్రలోనే ఒక భయానక అధ్యాయాన్ని లిఖించబోతుందని నోస్ట్రడామస్ హెచ్చరికలు జారీ చేశారు.

యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు
ఆయన జ్యోతిష శాస్త్ర అంచనాల ప్రకారం 2025 చివరి నెలలలో ప్రపంచవ్యాప్తంగా అనేక ఆందోళనలు, అశాంతి తీవ్రస్థాయికి చేరుకుంటాయని ఆయన అంచనా వేసినట్టు అనేక నివేదికల ద్వారా తెలుస్తుంది.దేశాల మధ్య అంతర్గత కలహాలు, సరిహద్దు ఘర్షణలు తీవ్ర రూపం దాల్చి భయానక యుద్ధం జరిగే అవకాశం ఉందని, ఇక ప్రకృతి వైపరీత్యాలు కూడా మానవాళిని వెంటాడుతాయి అని నోస్ట్రడామస్ తన జ్యోతిష శాస్త్ర అంచనాలలో తెలిపారు.
పాత వ్యాధులు, ప్రాణాంతక మహమ్మారులు విజృంభిస్తాయన్న నోస్ట్రడామస్
అంతేకాదు ఆకాశం నుంచి ఒక అగ్నిగోళం భూమిపైకి దూసుకు వచ్చి గందరగోళాన్ని వినయాన్ని సృష్టిస్తుందని ఆయన హెచ్చరించారు. ఇక పాత వ్యాధులు, ప్రాణాంతక మహమ్మారులు విజృంభించే అవకాశం ఉందని నోస్ట్రడామస్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని 2025 ముగింపు సమీపిస్తున్న వేళ జరిగే దారుణ పరిణామాల గురించి నోస్ట్రడామస్ తన జ్యోతిషశాస్త్ర అంచనాలలో పేర్కొన్నారు.
2025 చివరలో ప్రళయం
ఇప్పటికే 2020లో కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కరోనా మహమ్మారి ప్రభావం ఇప్పటికీ మానవ సమాజం పైన కనిపిస్తూనే ఉంది. పోస్ట్ కోవిడ్ కారణంగా అనేక అనారోగ్యాలతో నేటికీ ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. ఈ సమయంలో మళ్లీ పాత వ్యాధులు, ప్రాణాంతక మహమ్మారులు విజృంభిస్తాయి అని నోస్ట్రడామస్ చెప్పడం ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురిచేస్తుంది. 2025 చివరలో ప్రళయం ముందు రాబోతుందని ఆయన చెప్పిన జ్యోతిష్య అంచనా పై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications