వారఫలాలు: ధర్మమార్గంలో నడవండి.. బంగారు భవిష్యత్తు దొరుకుతుంది

ఈ వారం ఏ రాశివారికి బాగుంటుంది? ఎలా కలిసి వస్తుంది? అందుకు ఏం చేయాలి? అనుకూలతలు అయితే పర్వాలేదుకానీ ప్రతికూలతలు ఎదురైతే ఏం చేయాలి? వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా ఎటువంటి మార్పులు చోటుచేసుకోబోతున్నాయి? తదితర విషయాలను రాశి చక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు లెక్కకడతారు. ఈనెల 17 నుంచి 23 వరకు రాశి ఫలాల ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

తులా రాశి: వ్యాపారంలో కొత్తగా చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనలాభం ఉంది. పనులను వాయిదా వేయొద్దు. ధర్మమార్గంలో ముందుకు సాగండి. ఇష్టదేవతను ధ్యానించండి. కొందరివల్ల ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఓర్పుతో ఉండాలి.

weekly horoscope

వృశ్చిక రాశి: పదవీ లాభం కనపడుతోంది. కొందరికి మేలు జరుగుతుంది. శుభయోగాలున్నాయి. ఆర్థిక నిర్ణయాలన్నీ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని తీసుకుంటుండాలి. కుటుంబ సభ్యుల నుంచి సహకారం అందుతుంది. మహాలక్ష్మిని స్మరించాలి.

ధనుస్సు రాశి: ఇంట్లో, బయట కూడా పనులు పూర్తవుతాయి. ఆర్థిక స్థితిని ఒక ప్రణాళిక ప్రకారం మెరుగు పరుచుకోవాలి. నూతన బాధ్యతలు వస్తాయి. అధికార యోగం కనపడుతోంది. రుణ సమస్యలు తొలగుతాయి. భూమి, వాహన యోగాలున్నాయి. ఇష్టదేవతను ధ్యానించడంవల్ల ఆనందం దొరుకుతుంది.

మకర రాశి: పనిచేయడానికి ఏకాగ్రత అవసరం. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. బాధ్యతలను నిర్వర్తించడంవల్ల ఇబ్బందులను అధిగమించవచ్చు. అపార్థాలకు తావివ్వకూడదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. సహనం కాపాడుతుంది. నవగ్రహ శ్లోకాలు పఠించాలి.

కుంభ రాశి: ఎవరినీ నమ్మొద్దు. లక్ష్యంపై దృష్టిపెట్టాలి. పనుల్లో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే వ్యాపారంలో నష్టం రాకుండా ఉంటుంది. ధర్మం కాపాడుతుంది. నవగ్రహ శ్లోకాలు పఠించాలి. శుభవార్తను వింటారు.

మీన రాశి: వ్యాపారం కలిసివస్తుంది. మనో బలంతో ముందుకు నడవాలి. ధనలాభాలున్నాయి. అదృష్టం తోడుంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పెట్టుబడులు లాభాలనిస్తాయి. ఉద్యోగంలో వాతావరణం మిశ్రమంగా ఉంటుంది. ఎవరితోను గొడవలు పడొద్దు. ఇష్టదేవతను స్మరించడంవల్ల బంగారు భవిష్యత్తు దొరుకుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+