సెప్టెంబర్ 21 ఆదివారం అమావాస్య అందులోనూ సూర్యగ్రహణం.. ఈ రాశులవారు జాగ్రత్త!
వేద జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంత అయితే ప్రాధాన్యత ఉంటుందో గ్రహణాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏర్పడే సూర్య చంద్ర గ్రహణాలు అందరినీ ప్రభావితం చేస్తాయి. సహజంగా గ్రహణాలను అశుభకరమైనవిగా భావిస్తారు. ఈ నెలలో సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. సెప్టెంబర్ 21వ తేదీన ఆదివారం భాద్రపద అమావాస్య రోజున రాత్రి 11గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది. అది తెల్లవారుజామున 3.23 నిమిషాల వరకు ఏర్పడుతుంది.
సూర్య గ్రహణం..ఈ రాశులవారు జాగ్రత్త
ఈసారి ఏర్పడేది పాక్షిక సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం అంటార్కిటికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో కనిపిస్తుంది. ఇక హిందూ పంచాంగం ప్రకారం ఈ సూర్యగ్రహణం కన్యారాశిలో ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో ఏర్పడుతుంది. ఈ సమయంలో కొన్ని రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సూర్య గ్రహణ ప్రభావం ఆయా రాశుల యొక్క ఆరోగ్యంపైన, మానసిక స్థితిపైన, జీవనశైలిపైన పడుతుంది. సూర్యగ్రహణం వేళ జాగ్రత్తగా ఉండవలసిన ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

మిధున రాశి
మిధున రాశి వారికి సూర్యగ్రహణం తీవ్ర సమస్యలను తీసుకువస్తుంది. ఈ సమయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసిన అడ్డంకులు ఎదురవుతాయి. డబ్బుల విషయంలో మోసపోయే అవకాశం ఉంది. ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా బలహీనంగా ఉంటారు. కనుక మిధునరాశి వారు జాగ్రత్తగా ఉండాలి.
కన్యారాశి
కన్యారాశి జాతకులు సూర్యగ్రహణం కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఉద్యోగులు, వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్య రాశి వారు ఆర్థికపరమైన విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య పరంగాను వీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమయంలో చాలా నష్టాలను చూడాల్సి వస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకుండా ఉండాలి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులు సూర్యగ్రహణం కారణంగా ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటారు. కుటుంబ జీవితంలో సమస్యలు వస్తాయి. చేసే పనులలో నిరాశ ఎదురవుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు నష్టాలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇది వీరికి చాలా కష్టాలను తెచ్చే కాలం .
మీనరాశి
మీనరాశి జాతకులు సూర్యగ్రహణం కారణంగా ఇబ్బందులు పడతారు. ఈ సమయంలో మీన రాశి వారికి ఏ పని చేసిన ప్రతికూల ఫలితాలే వస్తాయి. ఆర్థికపరంగా సమస్యలు పెరుగుతాయి. పెట్టుబడులు పెట్టే విషయంలో నష్టాలు జరిగే అవకాశం ఉంది. కేసుల్లో చిక్కుకుంటారు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
today rashiphalalu: నేడు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి సంపన్నులయ్యే రాశులవారు వీరే! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications