సెప్టెంబర్ లో ఈ రాశుల పంట పండినట్టే..పండగ చేస్కోండి!
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం సెప్టెంబర్ మాసంలో ముఖ్య గ్రహాల సంచారం కొనసాగుతుంది. సెప్టెంబర్ మాసంలో కుజుడు, బుధుడు, సూర్యుడు, శుక్రుడు రాశి మార్పు చెందుతారు. దీనితోపాటు నక్షత్ర మార్పు కూడా సంభవిస్తుంది. ముఖ్య గ్రహాలు రాశులను, నక్షత్రాలను మార్చినప్పుడు అన్ని రాశుల వారి పైన ప్రభావం పడుతుంది.
సెప్టెంబర్ మాసంలో ముఖ్య గ్రహాల రవాణా
కొన్ని రాశులు ప్రతికూల ఫలితాలను, కొన్ని రాశులు సానుకూల ఫలితాలను ఈ సమయంలో పొందుతాయి. సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారి పంట పండుతుంది. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలా లబ్ధిని పొందే రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభ రాశి
సెప్టెంబర్ మాసంలో ముఖ్య గ్రహాల సంచారం వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది . వృషభ రాశి జాతకులు ఈ సమయంలో శుభ ఫలితాలను పొందుతారు. పెళ్ళికాని వారికి వివాహ యోగం ఉంది. వృషభ రాశి వారి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వివిధ మార్గాల నుండి డబ్బు సంపాదిస్తారు. ఉదయం సాయంత్రం ఆవ నూనెతో దీపారాధన చేస్తే ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది.
కుంభరాశి
కుంభ రాశి జాతకులకు సెప్టెంబర్ మాసం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారు ఈ మాసంలో వివిధ గ్రహాల సంచారం కారణంగా శుభ ఫలితాలను పొందవచ్చును. ఈ సమయంలో వీరికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఎక్కువ లాభాలు వస్తాయి. మీరు మరింత మెరుగైన ఫలితాల కోసం శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించడం మంచిది. పాయసం నైవేద్యంగా పెడితే తీపి కబురు వింటారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసం మంచి ఫలితాలను ఇస్తుంది. కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసిన పూర్తవుతుంది. వీరి ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. కొత్త వ్యాపారాలను మొదలుపెట్టడానికి ఇది మంచి సమయం. వారానికి ఒకసారి ఆలయానికి వెళ్లి భగవంతుడి దర్శనం చేసుకుంటే వీరికి మరింత శుభం జరుగుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications