సెప్టెంబరు నెలలో మొత్తం తలరాతను మార్చుకునే రాశులు
గ్రహాల స్థానాల పరంగా సెప్టెంబరు నెల చాలా పెద్దదిగా జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ నెలలో మూడు గ్రహాలు తమ రాశిని మార్చుకోబోతున్నాయి. గ్రహాలకు రాజైన సూర్యుడు, సంపదను ఇచ్చే శుక్రుడు, గ్రహాలరకు రాకుమారుడులాంటి బుధుడు రాశులను మారుస్తాయి. దీనివల్ల ప్రపంచంతోపాటు మానవుల వ్యక్తిగత జీవితాలపై కూడా ప్రభావం పడుతుంది. బుధుడు కేవలం 21 రోజులు మాత్రమే రాశిలో ఉంటాడు. అదే సూర్యుడు నెలరోజులు ఉంటాడు. శుక్రుడు ప్రతి 26 రోజులకు రాశిని మారుస్తాడు. వీరు సెప్టెంబరు నెలలో ఏ రాశిలోకి ప్రవేశిస్తారో తెలుసుకుందాం.
బుధుడు
కర్కాటక రాశిలో తిరోగమన దిశలో ఉన్న బుధుడు వచ్చేనెల నాలుగోతేదీన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ నెలలోనే రెండోసారి బుధుడు తన రాశిని మారుస్తాడు. 23వ తేదీన కన్యారాశిలోకి సంచరిస్తాడు. చివరగా అక్టోబరు 10వ తేదీన తులారాశిలోకి ప్రవేశిస్తాడు.

శుక్రుడు
సంపదకు కారకుడయ్యే శుక్రుడు వచ్చేనెల 18వ తేదీన తులారాశిలోకి సంచారం చేస్తాడు. తిరిగి అక్టోబరు 13వ తేదీన వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు.
సూర్యుడు
తన సొంత రాశి సింహరాశిలో ఉన్న సూర్యుడు వచ్చే నెల 16వ తేదీ సోమవారం కన్యారాశిలోకి సంచారం చేస్తాడు. తర్వాత అక్టోబరు 17వ తేదీన తులారాశిలోకి ప్రవేశిస్తాడు.
లాభపడే రాశులు
ప్రధానంగా ఆరు రాశులకు లక్ష్మీదేవి అనుగ్రహం లభించనుంది. మీన రాశి, ధనుస్సు రాశి, తులా రాశి, కన్యారాశి, సింహరాశి, మేష రాశివారికి సెప్టెంబరు నెల ఎంతో ప్రయోజనాలను కలిగిస్తుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులను పూర్తిచేస్తారు. అదనపు ఆదాయానికి మార్గం దొరుకుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. న్యాయపరమైన కేసుల్లో విజయం దక్కుతుంది. ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్ లేదంటే వేతనం పెరుగుదల ఉంటుంది.












Click it and Unblock the Notifications