డిసెంబర్లో షడష్టక యోగంతో ఈ రాశులవారికి మహారాజయోగం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ఉండే ప్రత్యేక స్థానం ప్రతి ఒక్కరికి తెలిసిందే. శని క్రమశిక్షణను నేర్పే గ్రహం అటువంటి శనిగ్రహం కర్మలకు అధిపతిగా వ్యవహరించే అంగారక గ్రహంతో కలయిక జరపబోతోంది. డిసెంబర్ 7వ తేదీన శని, అంగారక గ్రహాల కలయిక కారణంగా షడష్టక యోగం ఏర్పడబోతోంది. ఈ షడష్టక యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
డిసెంబర్ లో షడష్టక యోగం
ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో తిరోగమన దిశలో సంచరిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి వరకు కూడా కుజుడు కర్కాటక రాశిలో తిరోగమంలోనే తిరుగుతూ ఉంటాడు. ఇక శని ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. శని, కుజుడు ఆరవ స్థానం, ఎనిమిదవ స్థానాలలో వారి వారి రాశులలో ఉండబోతున్నారు. దీనివల్ల షడష్టక యోగం ఏర్పడుతుంది. ఈ షడష్టక యోగంతో లబ్ధి పొందే రాశులను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
డిసెంబర్ మాసంలో ఏర్పడే షడష్టక యోగం కారణంగా మేష రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. దీని కారణంగా మేష రాశి వారి వృత్తి జీవితం అద్భుతంగా సాగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఊహించని విధంగా డబ్బు వస్తుంది. ఈ సమయంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా మంచి ఫలితాలను పొందుతారు. మేష రాశి వారి సంపద పెరుగుతుంది. వీరి ఆరోగ్యం బాగుంటుంది.
తులారాశి
షడష్టక యోగం కారణంగా తులారాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. డిసెంబర్ 7వ తేదీ నుంచి తులారాశి వారి జీవితం చాలా బాగుంటుంది. వీళ్లు కొత్త పనులు చేయడానికి ఈ సమయం అనుకూల సమయం. జీవితంలో ఉండే సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా బలోపేతం అవుతారు. అయితే పెళ్లి కాని వారు, వివాహేతర సంబంధాలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం.
కుంభరాశి
షడష్టక యోగం కారణంగా కుంభ రాశి వారికి కలిసొస్తుంది. కుంభరాశి జాతకులు ఈ సమయంలో విపరీతమైన లాభాలను పొందుతారు. మీరు విజయాలను సాధిస్తారు. వర్తక వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో కుంభ రాశి వారు సంతోషంగా జీవిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications