ఈ రాశులకు సంపదలను, రాజయోగాన్ని ప్రకటించిన శని!!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వారం ముఖ్య గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తున్నాయి. శని తన అసలు త్రిభుజ రాశిలో ఉండడం వల్ల ఈ వారంలో శని రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి విశేష ఫలితాలు రానున్నాయి.
శని రాజయోగం
శని తన అసలు త్రిభుజ రాశి అయిన కుంభ రాశిలో ఉన్నాడు. కుంభరాశిలో శని మార్చి 28 2025 వరకు ఉంటాడు. కుంభరాశిలో ప్రవేశించిన నాటి నుండి మొత్తం 250 రోజులు కుంభ రాశిలో శని ఉంటున్నాడు. శని ముఖ్యంగా ఈ రాశుల పైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తున్నాడు.

మేషరాశి
తన త్రిభుజ రాశిలో శని సంచారం కారణంగా ఏర్పడే శనిరాజ యోగంతో మేష రాశి వారికి మేలు జరుగుతుంది. మేషరాశి వారి జీవితంలో సానుకూలమైన ప్రభావాలు వస్తాయి .ఆర్థికంగా మేషరాశి వారికి కలిసి వస్తుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులను పెట్టి లబ్ధిని పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది.
మకర రాశి
శని రాజయోగం కారణంగా మకర రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వారు ఏ పని చేసినా లబ్ధిని పొందుతారు. ఆర్థికంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు సానుకూలమైన ప్రభావాలు ఉంటాయి. ఈ సమయంలో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
సింహరాశి
శని రాజయోగం ప్రభావంతో సింహ రాశి వారికి కలిసొస్తుంది. ఇంటా బయట సింహరాశి జాతకులు పూర్తి మద్దతు పొందుతారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అదనపు ఆదాయం లభిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా అనుకూలంగానే ఉంటుంది.
కుంభరాశి
శని రాజయోగం ప్రభావంతో కుంభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. కుంభ రాశి వారికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తే ఇది సరైన సమయం. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. తల్లిదండ్రుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది సరైన సమయం వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications