వీరింటికి లక్ష్మీదేవిని పంపిస్తున్న శని... ఫిబ్రవరి, మార్చి నెలల్లో వీరికి పైసల పండుగ!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ సంచారాలకు చాలా ముఖ్యమైన ప్రాధాన్యత ఉంటుంది. శనిదేవుడిని కర్మదేవుడిగా జ్యోతిష్య శాస్త్రంలో చెబుతారు. అటువంటి శని శక్తివంతమైన గ్రహాలలో ఒకటిగా చెప్పబడుతుంది .ఫిబ్రవరి 28వ తేదీన శని తన సొంత కుంభరాశిలో దహనం అవుతుంది. ఆ తర్వాత మార్చి 29వ తేదీన శని మీనరాశిలో సంచారం మొదలుపెడుతుంది.

మార్చి వరకు రెండు సార్లు శని సంచారం
ఈ విధంగా శని మార్చి 2025 వరకు రెండుసార్లు తన కదలికలను చూపిస్తుంది. వీటి కారణంగా కొన్ని రాశుల వారి పైన చాలా బలమైన ప్రభావం పడుతుంది. కొన్ని రాశుల వారి అదృష్టం ప్రకాశిస్తుంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Shani blessings on these zodiac signs people February march months money festival for them

వృషభ రాశి
మార్చి 2025 వరకు శనిసంచారం కారణంగా వృషభ రాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. శని మీనరాశిలోని ఆదాయ మరియు లాభ గృహాలకు బదిలీ కావడం వల్ల ఈ సమయంలో మీకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఆదాయ స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి. వివిధ వనరుల నుండి డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. కార్యాలయంలో గౌరవం ఉంటుంది. పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది.

మకర రాశి
శనిదేవుడి సంచారం మకరరాశి వారికి చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. 2025 లో శని మీనరాశి లోకి ప్రవేశించి కొన్ని రాశుల వారికి ఏలినాటి శని నుంచి విముక్తి కల్పిస్తుంది. శని సంచారం కారణంగా మకర రాశి వారికి ఉద్యోగ వ్యాపారాలలో భారీ లాభాలు వస్తాయి. మకరరాశి జాతకులు ఈ సమయంలో శని నుంచి విముక్తి పొంది మంచి ఫలితాలను పొందుతారు. వీరు తాము చేయదలుచుకున్న పనులను కచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి శని సంచారం కారణంగా చాలా లబ్ది జరుగుతుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారు భారీ లాభాలను అర్జించే అవకాశం ఉంది. వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ధనుస్సు రాశి వారి కుటుంబ వివాదాలను సామరసపూర్వకంగా పరిష్కరించుకోవచ్చు. తల్లితో ధనుస్సు రాశి వారికి సంబంధం బలంగా ఉంటుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారు వివిధ పనులను విజయవంతంగా పూర్తి చేయగలరు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+