త్వరలో వీరే కుబేరులు..శాసనం చేసిన శని రాజయోగం!
న్యాయదేవుడు అయిన శని దేవుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కుంభరాశిలో ఆయన మూల త్రికోణంలో ఉన్నాడు. కుంభరాశిలో మూల త్రికోణ స్థితిలో శని దేవుడు ఉండడం వల్ల పంచ మహాపురుష రాజయోగాలలో ఒకటైన మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. శని దేవుడు 2025 మార్చి వరకు ఇదే రాశిలో ఉండబోతున్నాడు.
శశ మహాపురుష రాజయోగం
వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం శని దేవుడు తులారాశిలో గానీ, మకరరాశిలో గానీ, కుంభరాశిలో గాని చంద్రుని నుండి మొదటి, నాలుగవ, ఏడవ మరియు 10వ ఇంట్లో ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు శశ మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది.దీంతో అదృష్ట జాతకులు ప్రతి చోట గౌరవాన్ని పొందుతారు. వీరి జీవితంలో అన్ని విధాలుగా విజయాలు చేకూరుతాయి. ప్రస్తుతం శశ మహాపురుష రాజయోగం కారణంగా మూడు రాశుల వారు అదృష్ట జాతకులుగా మారుతున్నారు.

వృషభరాశి
వృషభ రాశిలో శని పదవ ఇంట్లో ఉండడంవల్ల వృషభ రాశి జాతకులకు చాలా విశేషమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఈ రాజయోగ సమయంలో వృషభ రాశి వారు నూతన ఇల్లు, వాహనాలు లేదా పెద్ద ఆస్తులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో వీరికి అకస్మాత్తుగా ఆర్థిక లాభాలు వస్తాయి .ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కెరీర్ కి సంబంధించి ఇప్పుడు మంచి నిర్ణయాలను తీసుకుంటారు.
తులారాశి
శశ మహాపురుష రాజయోగం కారణంగా తులారాశి జాతకులు విశేషమైన ప్రయోజనాలను పొందుతారు. శని దేవుడు తులా రాశి 5వఇంట్లో సంచరిస్తున్నాడు .కాబట్టి తులారాశి జాతకులకు ఈ సమయంలో భౌతిక సుఖాలు లభిస్తాయి. ఈ రాజయోగం కారణంగా సమాజంలో వీరికి గౌరవం లభిస్తుంది. పేరు ప్రతిష్టలు కలుగుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
మకర రాశి
శశ మహాపురుష రాజయోగం కారణంగా మకర రాశి జాతకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. శని దేవుడు మకర రాశి యొక్క రెండవ స్థానంలో నివసిస్తున్నాడు. ఇదే సమయంలో మకర రాశిలో ఏలినాటి శని చివరి దశ ప్రారంభిస్తుంది. అయినప్పటికీ ఈ సమయంలో ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. మకర రాశి వారికి ఇది సంతోషాన్ని సంపదను ఇచ్చే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications