Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫిబ్రవరి 22న శని నక్షత్ర మార్పు... వీరికి సంపదల కూర్పు

వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. గ్రహాలలో ముఖ్యమైన గ్రహంగా న్యాయమూర్తిగా భావించే శని దేవుడు వ్యక్తి యొక్క చర్యలను బట్టి వారికి ప్రతిఫలాలను అందిస్తాడు. శని దేవుడు కర్మలకు అధిపతి కావడంతో ఆయన ప్రభావం అన్ని రాశుల వారి జాతకాల పైన ఉంటుంది .సుమారు రెండున్నర సంవత్సరాలు శని దేవుడు ఒక్కో రాశి చక్రంలో సంచారం చేస్తాడు.

ఉత్తరాభాద్ర రెండో పాదంలోకి శనిదేవుడు

ఈ సమయంలో ఆయన అనేక నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాడు. ప్రస్తుతం శని దేవుడు ఉత్తరాభాద్ర మొదటి దశలో సంచారం చేస్తున్నాడు. ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం నాలుగు గంటల 9 నిమిషాలకు ఉత్తరాభాద్ర రెండవ పాదంలోకి శని దేవుడు ప్రవేశిస్తాడు. ఈ సంచారం 12 రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా మూడు రాశులకు అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులను తెలుసుకుందాం.

shani transit into uttarabhadra nakshatra will give good fortune to these zodiac signs from february 22

మకర రాశి

శని నక్షత్ర మార్పు మకరరాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. శని మకర రాశిలో మూడవ ఇంటిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈ రాశి జాతకులకు శని స్థానం బలంగా మారుతుంది .ఈసమయంలో ధైర్య, శౌర్యాలను వీరు ప్రదర్శిస్తారు. విదేశాలకు సంబంధించి పని చేసేవారు మంచి లాభాలను పొందుతారు. శని మిమ్మల్ని మరింత కష్టపడి పని చేయమని కోరే అవకాశం ఉంది. ఈ సమయంలో తోబుట్టువుల నుండి కూడా మద్దతు లభిస్తుంది.

మిధున రాశి

మిధునరాశి వారికి శని నక్షత్ర స్థితిలో మార్పు శుభప్రదంగా కనిపిస్తుంది. మీ సంచార జాతకంలోని కర్మభావంలో శని సంచరిస్తున్న కారణంగా వర్తక వ్యాపారాలు చేసే వారికి కృషికి తగిన ప్రతిఫలం వస్తుంది. ఉద్యోగాలలో ఉన్నవారు పనిలో ప్రశంసలను పొందుతారు. జూనియర్లు సీనియర్ల మద్దతు పొందుతారు. వ్యాపారవేత్తలు తమ పనిలో మంచి సహాయ సహకారాలను పొందుతారు. లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాకుంటే ఈ సమయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి

శని నక్షత్ర మార్పు మీనరాశి జాతకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. శని మీ రాశిలో లగ్న గృహానికి వెళుతున్న కారణంగా ఈ సంచారం మీనరాశి జాతకులకు కలిసి వస్తుంది. మీరు ప్రజాదరణను పొందుతారు. పెళ్లయిన వారు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తారు. వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఈ సమయంలో ఎవరితోనూ వాదనలకు దిగకూడదు. సమాజంలో గౌరవ, మర్యాదలు పొందడానికి ఇది మంచి సమయం, కాబట్టి కాస్త ఆచితూచి వ్యవహరిస్తే అంతా మంచి జరుగుతుంది.

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు. వ్యక్తిగత జాతకాలను బట్టి ఫలితాలు మారవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+