శంఖుపూలు చాలా పవర్ ఫుల్.. ఈ మొక్కతో మీ ఇంట్లో లక్ష్మీ నివాసం!
శంఖు పుష్పం మొక్క తీగజాతికి చెందిన మొక్క. వాస్తును నమ్మే చాలా మంది శంఖు పుష్పం మొక్క ఇంట్లో పెంచుకుంటారు. అయితే ఇది ఏ దిశలో పెంచుకుంటే మంచిది? ఈ మొక్క ఇంట్లో ఉంటే మీ భవిష్యత్ ఎలా ఉంటుంది? వీటి పుష్పాలు ఏ ఏ దేవుడికి ఏయే రోజుల్లో ఎలా వినియోగిస్తారు? వాస్తులో శంఖు పుష్పం ప్రాధాన్యత ఏంటి? తెలుసుకోండి.
శంఖు పూల మొక్క వాస్తు నియమాలు
శంఖు పుష్పాలు శంఖం ఆకారంలో నీలం రంగులో వుంటాయి. శంఖు పూల మొక్క ఇంట్లో ఉండటం వలన అష్టైశ్వర్యాలు, సిరిసంపదలు కలుగుతాయి అని నమ్మకం. అయితే శంఖు పూల మొక్కను ఉత్తరం దిశలో, తూర్పు, ఈశాన్య దిశలలో నాటితే మంచి జరుగుతుంది. అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపున కుండీలో పెడితే శుభప్రదంగా ఉంటుంది. అంతేకాదు శంఖు పూల మొక్కను గురువారం, శుక్రవారం నాటితే మంచి జరుగుతుంది.

విష్ణు, లక్ష్మీదేవికి శంఖుపూలతో పూజ చేస్తే సకల సంపదలు
శంఖు పుష్పాలు చాలా పవిత్రమైనవి అందుకే ఈ పూలతో దేవుళ్ళకు ఆయా వారాలలో ప్రత్యేక పూజలు చేస్తారు. శంఖు పుష్పాలతో శ్రీ మహా విష్ణువు, లక్ష్మీ దేవతలను పూజిస్తారు. శ్రీ మహా విష్ణువు, లక్ష్మీ దేవతలను శుక్రవారం పూజిస్తే చాలు మీకు సిరిసంపదలు కలుగుతాయి. ఇక శనీశ్వరుడికి కూడా శంఖు పూలంటే చాలా ప్రీతి. కనుక శనివారం శనీశ్వరుడి పూజకు శంఖు పూలను వినియోగిస్తే మంచిది.
శనివారం శంఖు పూలతో శనిదేవుడి పూజలు ఇలా చేస్తే మంచిది
శనివారం శని దేవుడికి తొమ్మిది పువ్వులతో పూజలు చేస్తే చాలా మంచి జరుగుతుందని, శని దేవుడి కటాక్షం ఉంటుందని చెప్తారు. శని దేవుడికి పూజలు చేసిన పూలను నీటిలో వేయండి మీపైన ఉండే శని నీటి ప్రవాహంలో కొట్టుకునిపోతుందని చెప్తారు. ఆ విధంగా ఒక మూడువారాలు చేసిన వారు శనీశ్వరుడి అనుగ్రహం పొందుతారు. లక్ష్మీ దేవి మీపై కటాక్షం చూపిస్తుంది. అంటే మీకు ఆర్థిక సమస్యల నుండి విముక్తి కలుగుతుంది.
శంఖుపూలతో హనుమాన్ పూజలు చేస్తే కలిగే ఫలితాలివే
ఉద్యోగ అవకాశాలు లేనివారు శంఖు పుష్పాలతో ఆంజనేయ స్వామిని పూజిస్తే మీ భవిష్యత్ బాగుంటుంది.పెళ్ళికాని ప్రసాదులు ఉద్యోగం లేక బాధపడేవారు, అలాగే వ్యాపార రంగంలో ఉన్నత స్థాయిలో రాణించలేక మదనపడేవారు శంఖు పుష్పాలతో ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి పదకొండు పుష్పాలను తమ గుప్పిట్లో పట్టుకొని మీ సమస్యలను మీ మనస్సులో తలచుకొని ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పుష్పాలను ఉంచాలి. అలా చేయడం వలన మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి మీకు తోడుగా ఉండి మీ సమస్యలను పరిష్కరిస్తాడని చెప్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications