శశ మహాపురుష రాజయోగంతో ఈ రాశులకు తిరుగే లేదు.. కింగ్ సైజ్ లైఫ్!

2024 లో శని గ్రహం కుంభ రాశిలోకి ప్రవేశించి అరుదైన శుభప్రదమైన శశ మహాపురుష రాజ యోగాన్ని ఏర్పరిచింది. ఈ శక్తివంతమైన గ్రహాల అమరిక 2025 వరకు కొన్ని రాశుల వారికి శ్రేయస్సును, విజయాన్ని, వృద్దిని తెస్తుంది. క్రమశిక్షణకు మారుపేరైన శని కష్టపడి పని చేసే వారందరిని ఎప్పుడూ కటాక్షిస్తూనే ఉంటాడు. అటువంటి శని ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు.

శని శశ మహాపురుష రాజయోగం
కుంభరాశిలో కేంద్ర గృహంలో శని ఉన్నప్పుడు, శని తను ఉన్నతమైన లేదా సొంత రాశిని ఆక్రమించినప్పుడు శశ మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Shash mahapurush Rajyoga has announced these zodiac signs a king size life

వృషభ రాశి
శశ మహాపురుష రాజయోగం కారణంగా వృషభ రాశి వారు కెరీర్లో అద్భుతమైన విజయాలను సాధిస్తారు. ప్రమోషన్లు, కొత్త ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వృషభ రాశి వారి వ్యాపార వృద్ధి జరుగుతుంది. వృషభ రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు చేసే స్థిరమైన ప్రయత్నాలు, దీర్ఘకాలిక ఫలితాలను ఇస్తాయి. కాబట్టి వృషభ రాశి జాతకులు ఏకాగ్రతతో ఉండాలి.

కన్యారాశి
కన్యా రాశి వారికి శశ మహాపురుష రాజయోగం కారణంగా వ్యక్తిగతమైన మరియు వృత్తిపరమైన సంబంధాలలో సానుకూలతలు వస్తాయి. ఈ సమయంలో మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. ఆర్థిక స్థిరత్వం వస్తుంది. పనిచేసే చోట గౌరవం మరియు మర్యాదలు దక్కుతాయి. ఇది కన్య రాశి వారికి అదృష్ట సమయం.

తులారాశి
తులారాశి జాతకులకు శశ మహా పురుష రాజయోగం వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలలో సానుకూలతలకు కారణమవుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక అభివృద్ధికి కారణం అవుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఇది సరైన సమయం. ఇది తులా రాశి జాతకులకు అన్ని విధాలుగా కలిసివస్తుంది.

మకర రాశి
శశ మహాపురుష రాజ యోగం కారణంగా మకర రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. ఈ సమయంలో మకర రాశి జాతకులు కృషికి తగిన ఫలితాన్ని పొందుతారు. వ్యక్తిగత జీవితంలో స్థిరత్వం వస్తుంది. ఈ కాలం మకర రాశి వారికి బాగా కలిసి వస్తుంది.

కుంభరాశి
శశ మహాపురుష రాజయోగం కారణంగా కుంభరాశి జాతకులకు ఇది మంచి సమయంగా ఉంటుంది. కుంభ రాశి వారు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రంగాలలో అపారమైన అభివృద్ధిని సాధిస్తారు. కుంభ రాశి వారు వ్యాపారంలో ముఖ్యమైన మైలురాళ్లను సాధించి ముందుకు సాగుతారు. ఇది కుంభ రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైన సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+