shraavan 2023: ఈ మాసంలో తులసిమొక్కను నాటేందుకు శుభ దినాలివే!!
హిందూ మతంలో తులసి మొక్కను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. తులసి శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది. అందుకే తులసిని విష్ణుప్రియ అని పిలుస్తారు. తులసి చెట్టును క్రమం తప్పకుండా పూజించడంవల్ల శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడు అవుతాడని చెబుతారు. అయితే ఇంట్లో తులసి మొక్క నాటడానికి కొన్ని ప్రత్యేకమైన నియమాలున్నాయి.
ముఖ్యంగా శ్రావణ మాసంలో తులసి మొక్కలు నాటితే చాలా మంచి జరుగుతుందని చెబుతారు. తులసి మొక్క నాటడానికి కొన్ని ప్రత్యేకమైన రోజులు, ప్రత్యేకమైన దిశలు ఉన్నాయి. శ్రావణ మాసంలో ముఖ్యంగా తులసికి సంబంధించిన నియమాలు పాటించకపోతే ఇంటికి దరిద్రం వస్తుంది. ఇక శ్రావణ మాసంలో ఆదివారం నాడు తులసి మొక్కలను నాటకూడదు.

ఆదివారం నాడు తులసి మొక్కకు నీరు పోయకూడదు. అంతేకాదు ఆదివారం నాడు తులసి ఆకులను కోయడం కూడా మంచిది కాదు. గురువారం నాడు తులసి మొక్కలు నాటడం శుభప్రదం. గురువారం నాడు తులసి మొక్కలను నాటితే జాతకంలో గురుబలం పెరుగుతుంది. బుధవారం నాడు తులసి మొక్కలను నాటడం కూడా శ్రేయస్కరంగా చెప్పబడింది.
జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నవారు బుధవారం ఇంట్లో తులసి మొక్కలు నాటాలి. తులసి మొక్కని ఎప్పుడూ ఆగ్నేయ మూలలో నాటకూడదు. ఎప్పుడూ ఉత్తరం లేదా ఈశాన్య దిశలో తులసి మొక్కను పెట్టాలి. తులసి మొక్కను ఎప్పుడూ చీకట్లో ఉంచకూడదు. సాయంత్రం పూట తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి. తులసి మొక్క చుట్టూ ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి.
అంతే కాదు తులసి మొక్కను ఎప్పుడు ముళ్ళ మొక్కలతో కలిపి పెట్టకూడదు. తులసి మొక్కను నేరుగా భూమిలో కాకుండా కుండీలలో నాటాలి. ఎండిపోయిన తులసి మొక్కను ఇంట్లో ఉంచకూడదు. ఎందుకంటే ఇది కుటుంబ సభ్యులకు దురదృష్టాన్ని తీసుకువస్తుంది. స్నానం చేయకుండా పొరపాటున కూడా తులసి ఆకులను ముట్టుకోకూడదు. ఇక ఇన్ని నియమాలను పాటిస్తూ తులసి మొక్కను పూజిస్తే జీవితంలో విష్ణు మరియు శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉంటాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications