2025 ఏప్రిల్ లోగా ఈ రాశులవారు అపర కుబేరులవుతున్నారు
నవగ్రహాల్లో శుక్రుడు, రాహువు గురు, శిష్య గ్రహాలు. ఈ రెండు కూలిసి ఒకే రాశిలో సంచారం చేస్తే అద్భుతమైన ధనలాభం కలుగుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. రాశిచక్ర గుర్తులకు శుక్రుడు జాతకంలో శుభస్థానంలో ఉంటే అద్భుతమైన సంపదను ప్రసాదిస్తాడు. రాహువు నుంచి మంచి జరుగుతుంది. గురు శిష్యులిద్దరూ కలిసి 2025 జనవరి 28వ తేదీ నుంచి ఏప్రిల్ నెలవరకు ఆరు రాశులపై కనక వర్షం కురిపిస్తున్నారు. ఏయే రాశులనే వివరాలను తెలుసుకుందాం.
ధనుస్సు
ఇంట్లో శుభకార్యాలున్నాయి. ఉద్యోగంలో అధికారి అవుతారు. వ్యాపారస్తులు లాభాలబాటలో పయనిస్తారు. దాంపత్య జీవితం బాగుంటుంది. ఆస్తి కలిసివస్తుంది. ఇంటితోపాటు బండి సౌకర్యం ఒనగూరుతుంది. ఉద్యోగరీత్యా విదేశీ యోగం కలుగుతుంది.

కన్య
ఆరోగ్యం బాగుంటుంది. అదే మీకు సంపద. రుణ సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగాన్ని సంపాదిస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని అలంకరిస్తారు. ప్రేమలో పడటం లేదంటే పెళ్లి కుదరడం జరుగుతుంది. కష్టాలు తగ్గిపోతాయి.
మకరం
మంచి హోదాతో ఉద్యోగం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. మనసులో ఉన్న కోరికలన్నీ దాదాపుగా నెరవేరుతాయి. ఉద్యోగంలో మంచి వృద్ధి ఉంది. వ్యాపారాల్లో మంచి లాభాలున్నాయి. ఎదుటివారికన్నా గొప్పగా ఉండాలనే ఆలోచన మానుకోవాలి.
కుంభం
అదృష్టం పడుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి అవకాశాలు వస్తాయి. శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు రాబడికి లోటు లేదు. అదృష్టం తోడుండటంవల్ల అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు. వృత్తి రీత్యా విదేశాలకు వెళతారు.
వృషభం
ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంది. చిన్న చిన్న ప్రయత్నాలతోనే ఎక్కువ డబ్బును సంపాదిస్తుంటారు. అదనపు ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి. వ్యాపారంతోపాటు వృత్తిలో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. వివాహం విషయంలో బాగా డబ్బున్న కుటుంబానికి చెందినవారితో పెళ్లి కుదురుతుంది. వాస్తవంగా చెప్పాలంటే రాహువుతో శుక్రుడు యుతి చెందడంవల్ల అపర కుబేరులవుతున్నారు.
కర్కాటకం
వారసత్వంగా వస్తున్న ఆస్తి ఈ సమయంలో మీకు లభిస్తుంది. దాని విలువ కూడా బాగా పెరుగుతుంది. ఇంటికి సంబంధించి, వాహనానికి సంబంధించి కొంతకాలంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి. సంపన్న కుటుంబానికి చెందినవారితో సంబంధం కుదురుతుంది. దాదాపుగా మీరు కోటీశ్వరులవుతున్నారు. అన్ని వైపుల నుంచి ఆదాయం లభించనుంది. గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది.












Click it and Unblock the Notifications